చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకునేందుకు నీటి వివాదాలను వాడుకునే క్షుద్ర రాజకీయాలను బీఆర్ఎస్ చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును భూతంగా చూపించేందుకు ఫామ్ హౌస్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసలు బనకచర్ల సమస్య వచ్చింది.. కేసీఆర్, హరీష్ సంతకాల వల్లేనన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు 811 TMC అడుగుల నీటిలో తెలంగాణకు 66% ఉండగా, కేసీఆర్ కేవలం 299 TMC అడుగులకు సంతకం చేశారని, దీనివల్ల తెలంగాణకు 512 TMC నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని గుర్తు చేశారు.
అలాగే గోదావరి జలాలను నాలుగు వందల టీఎంసీలను రాయలసీమకు తరలించడానికి కూడా కేసీఆర్ అంగీకరించారని 2016లో చంద్రబాబు కేసీఆర్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయన్నారు. జగన్ సీఎం అయ్యాక పెన్నాకు తరలింపుపై చర్చలు జరిపారన్నారు. అప్పుడే బనకచర్లకు బీజం పడిందన్నారు. వారు చేసిన అ్యాయంతోనే ఇప్పుడు తెలంగాణకు ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టం చేశారు. బనకచర్లకు కేంద్రం పుల్ స్టాప్ పెట్టలేదని కామా మాత్రమే పెట్టిందని .. అందుకే అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు.
నీటి వివాదాలతో బలపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూంటే.. కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటా .. బీఆర్ఎస్ ఆఫీసు నుంచి వచ్చిందేనని స్పష్టం చేశారు. తాము ఢిల్లీ వెళ్లి బకనచర్లపై ఫిర్యాదు చేస్తే.. అంతకు ముందు కిషన్ రెడ్డి ఈ అంశంపై కేంద్ర మంత్రి పాటిల్ తో రహస్య చర్చలు జరిపారని మండిపడ్డారు. అంతకు ముందు బనకచర్లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా భవన్ లో ప్రజంటేషన్ ఇచ్చారు.