మూడో తేదీన జగన్ నెల్లూరుకు వచ్చి జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారని వారం, పది రోజుల కిందటే షెడ్యూల్ ఖరారు అయింది. అప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ప్రతి రెండో రోజులకో సారి మీడియా ముందుకు వచ్చి .. జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. దుమ్ము రేపుతాం.. దద్దరిల్లేలా స్వాగతం చెబుతాం.. బలప్రదర్శన చేస్తాం అని ప్రకటనలు చేస్తూ వచ్చారు. సోమవారం కూడా ప్రెస్ మీట్ పెట్టి.. హెలిప్యాడ్ కు పర్మిషన్ ఇవ్వలేదని ఆయినా మా ప్లాన్లు మాకున్నాయని ఆపలేరని తొడకొట్టారు.
అయితే ఇప్పుడు ఆయనను జోకర్ చేస్తూ జగన్ రెడ్డి తన నెల్లూరు పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే హెలిప్యాడ్ అనుమతి రాలేదని చెబుతున్నారు. హెలిప్యాడ్ అనుమతి రాకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. లేకపోతే తిరుపతి వరకూ విమానంలో వెళ్లి అక్కడి నుంచి నెల్లూరు రావొచ్చు. ఇక్కడ మ్యాటర్ జగన్ హెలిప్యాడ్ కాదు.. జగన్ కు వెళ్లాలని అనిపించలేదు. దానికి కారణం ఏమిటో వాళ్లకి మాత్రమే తెలుసు. కానీ జగన్ రెడ్డి వస్తాడని.. తొడలు కొట్టిన అనిల్ కుమార్ పరువు మాత్రం పోయింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డి .. జైలుకెళ్లిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తరపు వారు అనుకుంటున్నారు. న్యాయసాయం కూడా పెద్దగా ఉండటం లేదని.. కొమ్మినేనికి అయితే రాత్రికి రాత్రికి కష్టపడి.. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ ఇప్పించారని.. అదే కీలకమైన నేతల విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ కూడా ఇటీవలి కాలంలో జైలుకెళ్లి పరామర్శించడం ఆపేశారు. సజ్జలను పంపుతున్నారు. కాకాణీని పరామర్శించాలనుకుని కూడా ఆగిపోయారు.