చంద్రబాబు నిజంగా అంత శక్తిమంతుడా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే అటు తెలంగాణ లో అయినా ఇటు ఏపీలో అయినా ఏం జరిగినా.. జరగకపోయినా దానికి చంద్రబాబే కారణం అంటూంటారు. రాజకీయంగా యాక్టివ్ గా లేకపోయినా ..తెలంగాణలో కూడా ఇప్పుడు చంద్రబాబే సెంటర్ పాయింట్. ఆయన చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో జరుగుతాయి.. జరగబోతాయి అని చెప్పుకునే పరిణామాలు అన్నీ చంద్రబాబు చుట్టూనే నడుస్తూండటంతో ఆయన పొలిటికల్ పవర్‌కు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నామస్మరణ జరగని రోజు ఉండదు !
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబు చుట్టూనే రాజకీయాలు జరుగుతూ ఉండటం .. తెలుగు రాష్ట్రాల స్పెషల్. టీడీపీ నేతలు చంద్రబాబును ఎలా తమ ఐకాన్ గా చూపించాలని అనుకుంటారో.. ఇతర పార్టీల వాళ్లు చంద్రబాబును అలా బూచిగా చూపించాలని అనుకుంటారు. అంటు ప్లస్ .. మైనస్ రెండూ చంద్రబాబుగానే చూపించే రాజకీయాలు నడుస్తూంటాయి. ఆయనను అభిమానించేవారు.. వ్యతిరేకించేవారు అన్నట్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. చంద్రబాబు నామస్మరణ జరగని రాజకీయం గత నాలుగు దశాబ్దాల్లో లేదంటే అతిశయోక్తి కాదేమో ?
టీడీపీ క్యాడర్‌కు ఇష్టం – ఇతర పార్టీల వారికి భయం
చంద్రబాబు రాజకీయాలు అంటే.. టీడీపీ క్యాడర్ కు ఇష్టం. కష్టపడి ..పైకి రావాలని ఆయన పనితీరుతోనే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు. రాజకీయాల్లో మంచితనం కూడా ఆయన సొంతం. దారి తప్పాలని.. రాజకీయంగా లాభం పొందేలా ప్రజల్ని వాడుకుందామని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించరు. ఇది లైక్ మైండెడ్ పీపుల్ని బాగా ఆకర్షిస్తుంది. కానీ జగన్ తరహా ప్రజాస్వామ్యం కోరుకునేవారికి ఆయన వ్యతిరేకం. దాడులు చేస్తాం.. దౌర్జన్యాలు చేస్తాం.. దోపిడీలు చేస్తామనుకునేవారంతా చంద్రబాబును వ్యతిరేకిస్తారు. ఆ విషయం తెలుసు కాబట్టే జగన్ వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రౌడీషీటర్లకు పరామర్శలు.. బెట్టింగ్ రాయుళ్లకు విగ్రహాలు పెడుతున్నారు.
చంద్రబాబు రాజకీయం సింపుల్ అండ్ స్ట్రెయిట్
చంద్రబాబు రాజకీయం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించారు. ఎవర్నీ దూషించరు. తమాషాలు చేస్తున్నారా అన్నదే ఆయన పరుషంగా మాట్లాడే మాట. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు. ఎప్పుడూ వ్యక్తిగతంగా చూడరు. కానీ ఆయన రాజకీయాల్ని అడ్వాంటేజ్ గా చేసుకుని ఆయన ను విలన్ గా చూపించి ఇతర పార్టీలు బలపడాలనుకుంటాయి. అది కూడా చంద్రబాబుకు ప్లస్సే అవుతోంది. రాజకీయంలో ఎక్కడ చూసినా చంద్రబాబే కనిపించేలా చేస్తోంది.