ప్రముఖ సెఫాలజిస్టుగా ప్రచారం చేసుకుని వైసీపీని, ఆ పార్టీ క్యాడర్ ను నిండా ముంచిన ఆరా మస్తాన్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్యాప్ అయిన ఫోన్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉండటంతో ఈ మేరుకు విచారణకు రావాలని ఆదేశించారు.
కానీ ఆరా మస్తాన్ మాత్రం సిట్ ఎదుట హాజరయ్యేందుకు వెనుకాడుతున్నారు. తనకు తీరిక లేకుండా పనులు ఉన్నాయని చెబుతూ దాటవేస్తున్నారు. ఇలా రెండు, మూడు సార్లు జరిగింది. కానీ ఈ సారి మాత్రం తప్పనిసరిగా రావాల్సిందేనని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరా మస్తాన్.. తాను సర్వేలు చేస్తానని రాజకీయనేతలలో కాస్త పలుకుబడి సంపాదించుకున్నారు. ఆయనను కూడా ట్యాపింగ్ లో టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ ట్యాపింగ్ ఆయన సీక్రెట్స్ ఏమైనా దొరికితే ఆయనను బ్లాక్ మెయిల్ చేసి తమకు అనుకూలంగా సర్వేలు రాయించుకున్నారేమో స్పష్టత లేదు కానీ.. ఆయన సర్వేలు మాత్రం బోల్తాలు కొట్టడం ప్రారంభించాయి. పలు ఉపఎన్నికలతో పాటు.. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బయాస్డ్ సర్వేలు ప్రకటించారు. చివరికి క్రెడిబులిటీ కోల్పోయారు. తన ఫోన్ ట్యాప్ అయిందన్న నిజాన్ని కూడా ఒప్పుకోలేని దీనస్థితిలో ఆయన పడ్డారు.