గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. బెయిల్ షరతుల కారణంగా ఆయన గన్నవరం దాటి పోయే అవకాశం లేదు. గన్నవరంలోనే ఉండాల్సి ఉంది. చికిత్స కోసం ఇతర అవసరాల కోసం హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది.
జైలు వద్ద వంశీ కోసం ఎవరూ రాలేదు. పేర్ని నాని మాత్రమే వచ్చారు. వంశీ భార్యతో పాటు కొద్ది మంది అనుచరులు వచ్చారు. వారితో కూడా పొడిపొడిగా మాట్లాడి కారు ఎక్కి వెళ్లిపోయారు వంశీ. మీడియాతో మాట్లాడలేదు. మామూలుగా జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు వైసీపీ మీడియా సాక్షి వచ్చి మాట్లాడాలని ఒత్తిడి చేస్తుంది. కానీ ఈ సారి మాత్రం ఏ మీడియా కూడా రాలేదు. సాక్షి కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. పేర్ని నాని .. వల్లభనేని భయపడే వ్యక్తి కాదని మళ్లీ రాజకీయాలు ప్రారంభిస్తారని ప్రకటించారు.
ఇప్పుడు కాకపోయినా మరో నాలుగేళ్ల తర్వాత అయినా వంశీ గన్నవరం నుంచి రాజకీయాలు ప్రారంభిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని బట్టి.. వంశీ ఇప్పుడల్లా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలు చేయరన్న అభిప్రాయం వినిపిస్తోంది. వంశీ కూడా.. వైసీపీ వల్ల తన బతుకు దుర్భరంగా మారిందన్న భావనలో ఉన్నారని.. రాజకీయాల విషయంలో ఆలోచించాలని అనుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి.. ఆరోగ్యం కుదటపడే వరకూ ఆయన సైలెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.