పేద కుటుంబాలంటే వైసీపీకి, జగన్ రెడ్డికి ఎంత అలుసో సింగయ్య కుటుంబంతో వారు చేస్తున్న రాజకీయాలే మరోసారి నిరూపిస్తున్నాయి. సింగయ్యను తొక్కి చంపేసి.. కనీసం ఆస్పత్రికి తరలించకుండా రోడ్డున పక్కన పడేసి పోతే.. పోలీసులు అంబులెన్స్ లో తరలించారు. వీడియోలు బయటపడే వరకూ.. సింగయ్య ను తొక్కేసింది తన కారేనని జగన్ కానీ.. వైసీపీ కానీ బయట పెట్టలేదు. ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చి ఆయన ఘోరమైన మనస్థత్వం గురించి రాష్ట్రమంతటా చట్ట జరుగుతూంటే.. సింగయ్య కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు.
సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుని జగన్ మాట్లాడారు. ఏమైనా సాయం చేశారో లేదో కానీ.. ఆమెకు మాత్రం బ్రెయిన్ వాష్ చేయించి.. బయట తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారు. ఆస్పత్రిలో బాగా మాట్లాడిన సింగయ్యను .. అంబులెన్స్ లో ఏదో చేశారని చెప్పుకొచ్చారు. ట్రైనింగ్ ఇచ్చినా కంగారులో ఆమె మాట్లాడిన మాటలు విని.. సింగయ్యను చంపేసిన తర్వాత కూడా ఈ పేద కుటుంబాన్ని జగన్ రెడ్డి, వైసీపీ వదలుకండా పావులుగా వాడుకుంటున్నారని స్పష్టమయింది.
సొంత కార్యకర్తను తొక్కి చంపేసి.. పోలీసుల్ని మిస్ లీడ్ చేసి.. బయపడిదామని అనుకున్నారు. దొరికిపోయాక.. వైఎస్ వివేకా హత్య కేసులో చెప్పినన్ని కథలు చెప్పారు. చివరికి డబ్బులు ఆశ చూపి సింగయ్య కుటుంబాన్నీ పావుగా వాడేస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబాన్ని జగన్ రెడ్డి, వైసీపీ ఇంతలా .. కనీస దయ, కరుణ లేకుండా.. రాజకీయాల కోసం వాడుకోవడం.. దళితుల్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఆదుకుంటాడని అనుకుంటే తన రాజకీయం కోసం బలి చేస్తున్నారని బాధపడే పరిస్థితి వచ్చింది.