• “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించే దిశగా తొలి అడుగు వేసింది.
• రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అమలైన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
• ‘సూపర్ 6’ హామీల అమలు, కీలక పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
• గత ఏడాది చేసిన పనులను ప్రజల ముందుంచటంతో పాటు, చేయబోతున ప్ర మంచిపై అవగాహన కల్పిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో పాలనను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ముందడుగు వేసింది కూటమి ప్రభుత్వం.
• ఈ సందర్భంగా ప్రజలు స్పందిస్తూ, “గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలులో వివక్షతను ఎదుర్కొన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అందరికీ సమానంగా ‘సూపర్ 6’ పథకాలు అందుతున్నాయి” అంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.