చెప్పు చెప్పు అంటే మా ఊరి మిరియాలు తాటికాయంత అనేస్తారు కొంత మంది. ఇలాంటి వారిలో వైసీపీ నేతలు ఉంటారు. బనకచర్ల కట్టడం జగన్ తో నే సాధ్యమని నినాదాలు ప్రారంభించేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బనకచర్లను కట్టే ఉద్దేశం చంద్రబాబుకు లేదని ఆయన చెబుతున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. తన నియోజకవర్గంలోని చిన్న చిన్న ప్రాజెక్టుల్ని..తానే కాంట్రాక్ట్ తీసుకుని కూడా పూర్తి చేయలేకపోయిన పెద్దిరెడ్డి.. అంతర్రాష్ట్ర వివాదాలతో ఉన్న బనకచర్లను జగన్ తో కట్టిస్తారట.
ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును పడుకోబెట్టబెట్టే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అంత సమస్య వచ్చింది. ఐదేళ్లలో ఫలానా ప్రాజెక్టును పూర్తి చేశారా అంటే చెప్పలేరు. పూర్తి చేయకుండా ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకు రిబ్బన్లు కట్ చేశారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం లో ఐదు వందల కోట్లు కేటాయిస్తే.. తక్కువ కేటాయించారని విమర్శించారు. మరి ఎందుకు ప్రారంభించారో చెప్పాల్సి పని లేదు.
ఐదు సంవత్సరాల ప్రజలు అధికారం ఇస్తే.. మొత్తం ఏపీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు. కొత్తవి కట్టకపోగా కనీసం నిర్వహణ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు వాటిని ఆగిపోయిన దగ్గర ప్రారంభించాలన్నా సరే.. ఐదేళ్ల తర్వాత అంచనాలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు బనకచర్లను జగనే వల్లే సాధ్యమని పెద్దిరెడ్డి బయలుదేరుతున్నారు.