హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ రెండు ఏళ్ల పాటు స్తబ్దుగా ఉండటంతో బిల్డర్ల దగ్గర ఇళ్లు పేరుకుపోయాయి. వాటిని అమ్ముకోవడానికి తల ప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికి హైదరాబాద్లోని తమ్ముడు కాని ఇళ్లు 54వేలకుపైగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తాజాగా నివేదించింది. ఇది చిన్న మొత్తం కాదు. అంత మేర బిల్డర్లు సొమ్ము అక్కడ స్ట్రక్ అయిపోయినట్లే. రేట్లు పెరిగే చాన్స్ లేకపోతే.. చాలా వరకూ బిల్డర్లు నష్టాల్లోకి వెళ్లిపోతారు.
రూ. 50వేల కోట్లకుపైగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టారు లో స్ట్రక్ అయిపోయినట్లుగా అనుకోవచ్చు. అందుకే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు లిక్విడిటీ సమస్య ఉంది. నిర్మాణంలోఉన్న ప్రాజెక్టులను నెమ్మదిగా నడిపిస్తున్నారు. బయటకు కాకపోయినా అంతర్గతంగా బేరాలాడి అయినా కొన్ని ఫ్లాట్లను తక్కువ ధరకు కొనుగోలుదారులకు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. నష్టం వస్తున్నా తప్పడం లేదని చెబుతున్నారు.
ఓ వైపు ఇలా ఇళ్లు అమ్ముడుపోక ఖాళీగా ఉంటే.. బడా సంస్థలు ప్రి లాంచ్ ఆఫర్లతో బుకింగులు చేసుకుంటున్నాయి. తమకు ఒక్క రోజే వేయి కోట్ల బుకింగులు జరిగాయని ప్రకటించుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో కానీ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇళ్ల ఓవర్ ఫ్లో ఉందని మాత్రం స్పష్టమవుతోంది.