వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోకి రంగం సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో అతి త్వరలోనే ఓసినిమా పట్టాలెక్కబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చక చక సాగిపోతున్నాయి. ఈ చిత్రానికి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. వెంకీ ఇమేజ్‌కి బాగా సూటయ్యే టైటిల్ ఇది.టైటిల్ వినగానే ఇది మంచి ఫ్యామిలీ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఈ కథని అలానే తీర్చిదిద్దబోతున్నాడని తెలుస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ టైపు కథ అని, హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రాబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే రేసులో త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. వెంకీ – త్రిషలది హిట్ కాంబో. ఈ కాంబోని త్రివిక్రమ్ రిపీట్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. అయితే హీరోయిన్ డేట్లు బల్క్ గా కావాలి. త్రిష కావల్సినన్ని డేట్లు ఇస్తుందా, లేదా? అనేది అనుమానం. మరోవైపు రుక్మిణి వసంతన్ పేరు కూడా పరిగణలో వుంది. రుక్మిణి కూడా ఫుల్ బిజీగా ఉంది. వెంకీతో తన జోడీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని టీమ్ భావిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపిస్తున్నా, మిక్కీ జే.మేయర్ కీ ఛాన్స్ వుందని తెలుస్తోంది. ఇలాంటి కథకు మిక్కీ సరిపోతాడు. ‘అ.ఆ’ తరవాత మిక్కీతో త్రివిక్రమ్ పని చేయలేదు. అందుకే ఈసారి మిక్కీ వైపు మొగ్గు చూపొచ్చు. మొత్తానికి వెంకటేష్ సినిమాకు సంబంధించిన పనులన్నీ చక చక సాగుతున్నాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.