నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్లపై చర్చించేందుకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడదాము .. చర్చకు రావాలని రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ స్పందించారు. 72 గంటల సమయం ఇస్తున్నాం ప్రిపేర్ అయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని రివర్స్ కౌంటర్ వేశారు. దానికి కూడా రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అక్కర్లేదని.. తాము చాలని కేటీఆర్ అన్నారు. అంటే.. అసెంబ్లీకి రారు.. కేసీఆర్ కూడా హాజరు కాదన్నమాట.
నీటి ఒప్పందాలపై చర్చించడానికి, నిజాలు బయట పెట్టడానికి అసెంబ్లీ కన్నా సరైన ప్లేస్ ఉండదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీనే ఫైనల్. చట్టసభలు కాకుండా బయట ఎక్కడ జరిగినా దానికి విలువ ఉండదు. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు .. ముఖ్యంగా కేటీఆర్‌కు తెలియనిది కాదు. అయినా ఆయన ఎందుకు ప్రెస్ క్లబ్ లో చర్చకు సవాల్ చేశారో కాంగ్రెస్ నేతలకు స్పష్టత ఉంది. అసెంబ్లీకి రావాలని తమ డిమాండ్ కాబట్టి.. ఎగగొట్టడానికి… ఇలా ప్లాన్ చేశారని అనుకుంటున్నారు.
జల ఒప్పందాల్లో కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి బయట పెడుతున్నారు. కృష్ణా జలాల విషయంలో ఆయన ఒప్పందం చేసుకున్న 299 టీఎసీల గురించి..గోదావరి జలాలను సీమకు తరలించడంపై కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలపైనా బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చెబుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్న బీఆర్ఎస్.. రేవంత్ అబద్దాలుచెబుతున్నారని అంటున్నారు. నిజాలు ఏమిటో మాత్రం చెప్పలేకపోతున్నారు. మొత్తంగా … జల వివాదంలో రేవంత్ అడ్వాంటేజ్ సాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది.