ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.100తో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. విధానం పేదల భూమి సమస్యలను పరిష్కరించడానికి, వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడానికి రూపొందించారు.
రూ.10 లక్షల విలువ వరకు ఉన్న వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్టిఫికెట్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో కేవలం రూ.100 చెల్లించి పొందవచ్చు. ఈ సౌకర్యం ద్వారా భూమి యాజమాన్య హక్కులను సులభంగా ధృవీకరించుకోవచ్చు. రూ.10 లక్షలకు మించిన విలువైన వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీగా రూ.1,000 వసూలు చేస్తారు. ఈ రుసుము సాధారణ రిజిస్ట్రేషన్ ఛార్జీల కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.
ఈ సేవలు గ్రామ/వార్డు సచివాలయాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. భూమి వివరాలు (సర్వే నంబర్, ఖాతా నంబర్, ఆధార్ నంబర్ , యజమాని పేరు సమర్పించాలి. ఆధార్ కార్డ్, భూమి రికార్డులు ఇతర గుర్తింపు రుజువులు చూపించాల్సి ఉంటుంది. వారసత్వ భూముల రికార్డులను తనిఖీ చేయడానికి మీ భూమి పోర్టల్ (http://meebhoomi.ap.gov.in) ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్‌లో అడంగల్, ROR-1B, విలేజ్ మ్యాప్, ఆధార్ లింకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.