సెలబ్రిటీల జీవితాలపై అందరికీ ఓ కన్ను ఉంటుంది. వాళ్ళ రిలేషన్స్, ప్రేమ, డేటింగ్ గాసిప్స్ పై ఆసక్తి ఉంటుంది. ఇక్కడ వరకూ ఓకే కానీ ‘ఎఫైర్’ తెరపైకి వచ్చినప్పుడే వాళ్ళ ఇమేజ్ కి చికాకు. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత ఎఫైర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత – రాజ్ నిడిమోరు మధ్య కొంతకాలంగా ఏదో నడుస్తోంది. ఫ్యామిలీ సీజన్ 2 వీళ్ళని దగ్గర చేసింది. రాజ్ నిడిమోరుతో కలసి ఓ నిర్మాణ సంస్థని కూడా ప్లాన్ చేసింది సామ్. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సమంత రాజ్ కి దగ్గరైందనే సంకేతాలు అందుతున్నాయి.
ఇండస్ట్రీలో సమంత చాలా గాసిప్స్ ని ఎదురుకుంది. ఒక దశలో ఓ హీరోతో పెళ్లి వరకూ వెళ్లింది. ఈ ఇద్దరూ కలసి పూజలు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తర్వాత ఎందుకో ఇద్దరూ విడిపోయారు. ఇక ప్రేమలకు ఫుల్ స్టాప్ పెట్టి నాగచైతన్యతో వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలబడలేదు. ఇద్దరూ అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చైతు శోభితని పెళ్లి చేసుకొని మళ్లీ ఓ ఇంటివాడైపోయాడు. సమంత మాత్రం ఒంటరిగా ఉంది.
అయితే ఈ మొత్తం జర్నీలో సమంతపై ఎప్పుడూ నెగెటివిటీ రాలేదు. కానీ ఇప్పుడు రాజ్ నిడిమోరు వ్యవహారంలో సమంత సోషల్ మీడియాకి టార్గెట్ అవుతోంది. దీనికి కారణం.. రాజ్ నిడిమోరు పెళ్లయిన వ్యక్తి. భార్య పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తి సమంత దగ్గరవడం, విహారయాత్రలకు వెళ్లడం కాస్త విడ్డూరంగానే ఉంది. దీంతో పాటు రాజ్ భార్య శ్యామిలీ వీరిద్దరి రిలేషన్ పై పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా వెకేషన్ పై ఆమె ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఏ మతమైనా మనం చేసే పనులు ఇతరులకు బాధపెట్టకూడదనే బోధిస్తుందనే అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టారు. గతంలో కూడా సమంత – రాజ్ నిడిమోరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకి వచ్చినప్పుడు కర్మ ఎవరినీ విడిచిపెట్టదని పోస్ట్ చేశారు. ఆమె మాటల్లో ఆవేదన జనాలకు అర్ధమౌతోంది.
అయితే ఈ విషయంలో సమంతకి నెగెటివిటీ పెరుగుతోంది. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఒక రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తితో రిలేషన్ నడపడం ఎఫైర్ అవుతుందని, దీనికి డేటింగ్ లవ్ అనే పేర్లు పెట్టొద్దని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఉండగా మరో అమ్మాయితో ఎలా రిలేషన్ ని నడుపుతున్నారని రాజ్ నిడిమోరుపై మరికొందరు ఫైర్ అవుతున్నారు.
కాలం ఎంత మారిపోయినా సమాజానికి ఓ దృష్టి ఉంటుంది. ఇద్దరు అవివాహితులు ప్రేమలో ఉండటానికి, ఇలాంటి రిలేషన్స్ కి తేడా వుంది. నయనతార కూడా ఇలానే నెగెటివిటీ మూటకట్టుకుంది. అప్పటికే పెళ్లయిన ప్రభుదేవని పీకల్లోతూ ప్రేమించిన నయన్ ..పెళ్లికి సిద్ధపడితే.. యావత్ తమిళనాడు నయనతారపై తిరగబడింది. అంతకుముందు నయన్ శింబుతో సహజీవనం చేసింది. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ప్రభుదేవ దగ్గరకి వచ్చేసరికి మత్రం ఎవరూ హర్షించలేదు.
ఇప్పుడు సమంత కూడా ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కొంటోంది. ఇలాంటి రిలేషన్షిప్ విషయంలో చాలా క్లారిటీతో ఉండాలి. శ్యామిలీ చెప్పినట్లు.. ఒక రిలేషన్ ఎవరినీ బాధపెట్టకూడదు. ఆరోగ్యకరమైన బంధాలతో జీవించడమే ఉత్తమ జీవన విధానం. ఈ విషయంలో సమంత – రాజ్ నిడిమోరు ఇద్దరూ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి.