రాఘవ్ జుయల్… ఈ పేరుతో పరిచయం లేకపోవచ్చు గానీ కిల్ సినిమాలో కిల్లర్ గ్రూప్‌లో “ఫణి” క్యారెక్టర్ అనగానే టక్కున గుర్తొస్తాడు. ఆ సినిమాలో తనది మామూలు నటన కాదు. ఆ సినిమాలో యాక్షన్ అంతలా పండటానికి కారణం క్రూరమైన కిల్లర్‌గా రాఘవ్ జుయల్ నటన. ఇప్పుడు ఈ నటుడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
నాని, శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ సినిమా కోసం రాఘవ్ జుయల్‌ను ఎంపిక చేశారు. కంప్లీట్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్లోనే కనిపించనున్నాడు రాఘవ్. ది ప్యారడైజ్ ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే తగినంతగా నటీనటుల ఎంపిక జరుగుతోంది. రాఘవ్ జుయల్ ప్రాజెక్ట్‌లోకి రావడం ప్యారడైజ్‌కు ప్లస్సే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీలో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రా స్టేట్మెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. హిట్ 3 తర్వాత నాని నుంచి వస్తున్న మరో వైలెంట్ సినిమా ఇది. వచ్చే ఏడాది మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.