వైజాగ్ కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండటంతో బండా రియల్ ఎస్టేట్ సంస్థలు తన ప్రాజెక్టులతో రంగంలోకి దిగుతున్నాయి. ఐటీ స్సేసెస్ , హౌసింగ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో పేరు తెచ్చుకున్న సత్వా గ్రూప్ విశాఖపట్నంలో భారీ ప్రాజెక్టు నిర్మించనున్నట్లుగా ప్రకటించింది. సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ పేరుతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ మిక్స్డ్-యూజ్ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.
ఇందులో గ్రేడ్ A ఆఫీస్ స్పేస్‌లు ఉంటాయి. అత్యాధునిక ఐటీ ఆఫీస్ స్పేస్‌లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs), క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ (AI) ఇన్నోవేషన్ కోసం నిర్మిస్తారు. విశాఖపట్నంను దేశంలోని ప్రముఖ ఐటీ హబ్‌లలో ఒకటిగా మార్చడానికి ఈ ఆఫీస్ స్పేస్‌లు దోహదపడతాయి. లగ్జరీ అపార్ట్మెంట్లు, స్మార్ట్ లివింగ్‌కు అనుగుణంగా నిర్మిస్తారు. ఆధునిక సౌకర్యాలు, సస్టైనబుల్ డిజైన్లు, అత్యుత్తమ జీవన నాణ్యతను అందించే హై-ఎండ్ రెసిడెన్షియల్ యూనిట్లు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 25,000+ డైరెక్ట్ జాబ్స్ యువతకు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ , ఇన్నోవేషన్ రంగాలను ప్రోత్సహించడం, ముఖ్యంగా విశాఖపట్నంను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సత్వా గ్రూప్ గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లలో సకాలంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన రికార్డ్ ఉంది, కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా సమయానుగుణంగా పూర్తవుతుందని ఆశించవచ్చు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ జూలై 8నన బెంగళూరులో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సత్వా గ్రూప్ ప్రతినిధులతో నారా లోకేష్ చర్చలు జరిపారు. ఆ సమావేశంలో ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకుకున్నారు. తర్వాత ఫత్వా గ్రూపు అధికారికంగా ప్రకటించింది.