శ్రీ‌కాంత్ కి అది సాధ్య‌మేనా?

విల‌న్ పాత్ర‌ల‌కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా ఎప్పుడు ట‌ర్న్ తీసుకొన్నాడో.. అప్పుడే త‌న లైఫ్ సెటిల్ అయిపోయింది. మొన్న‌టికి మొన్న ఆది కూడా విల‌న్ గా మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించుకొన్నాడు. ఆది ఓకే అంటే మ‌ళ్లీ త‌న‌తో విల‌న్ గెట‌ప్ వేయించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. తార‌కర‌త్న కూడా విల‌న్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీ‌కాంత్ దృష్టి కూడా నెగిటీవ్ పాత్ర‌ల‌పై ప‌డింది. ఈమ‌ధ్య శ్రీ‌కాంత్ విల‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌న్న వార్త‌లొచ్చాయి. వాటిలో నిజం లేదంటూనే `విల‌న్‌గా న‌టించ‌డానికి నేను రెడీనే` అంటూ సంకేతాలిచ్చాడు.

శ్రీ‌కాంత్ ఎంట్రీ నెగిటీవ్ పాత్ర‌ల‌తోనే మొద‌లైంది. ఆ త‌ర‌వాత హీరో అయ్యాడు. క‌థానాయ‌కుడిగా అవ‌కాశాలు త‌గ్గుతున్న‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ట‌ర్న్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ ఛాన్సులూ దొర‌క‌డం లేదు. దాంతో విల‌న్ పాత్ర‌లు చేయ‌డానికి మొగ్గు చూపుతున్నాడు. అయితే విల‌న్‌గా శ్రీ‌కాంత్ ని చూడ‌గ‌ల‌రా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. శ్రీ‌కాంత్‌పై ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉంది. ఎంత కావాల‌ని విల‌న్ ఎఫెక్టులు తెచ్చుకొన్నా… అది తెచ్చిపెట్టుకొన్న‌ట్టే ఉంటుంది. జ‌గ‌ప‌తి బాబు విల‌న్ అయ్యాడంటే.. త‌న‌కున్న ఇమేజ్ వేరు. తాను డీసెంట్ పాత్ర‌లే చేస్తున్నాడు. ఆటైపు క్యారెక్ట‌ర్ దొరికితే శ్రీ‌కాంత్ కూడా విల‌న్ గా సెట్ట‌యిపోవొచ్చు. మ‌రి శ్రీ‌కాంత్‌ని ఆ యాంగిల్‌లో చూపించే ద‌ర్శ‌కుడెవ‌రో…??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close