పేర్ని నాని అతి చూస్తూంటే వైసీపీ నేతలకూ ఓ డౌట్ కొడుతోంది. ఎవరూ చేయనంత.. ఎప్పుడూ లేనంత ఓవరాక్షన్ ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఆయన రాజకీయం అంతా బహిరంగంగానే ఉంది. ఆయనేం చేస్తున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో అంతా రికార్డెడ్ గా ప్రజల ముందు ఉంటోంది. అదంతా ప్రజల్లో వైసీపీ వ్యవహారాలను మరింత చులకన చేస్తోంది. చూడబోతూంటే పేర్ని నాని వైసీపీ కోవర్టా అన్న అనుమానాలు క్యాడర్ లో బలపడుతున్నాయి.
ఉప్పాల హారిక కారుపై రాళ్లు పడ్డాయి. ఆమె ఓవరాక్షన్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయినా పేర్ని నాని జగన్ రెడ్డి పీఏకో.. సజ్జల రెడ్డికో ఫోన్ చేసి.. బీసీ మహిళపై దాడి.. లోకేష్ చేయించాడని ప్రచారం చేద్దామని ప్రతిపాదించాడు. దాన్ని కూడా ఆయన వీడియో తీయించుకుని మీడియాకు ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అయింది. ఇదేందయ్యా.. ఇది అని వైసీపీ నేతలు కంగారు పడ్డారు. ఆ వీడియో మీడియా ముందు మాట్లాడలేదు.. ఇంట్లోనే మాట్లాడుతూండగా ఆయన అనుచరుడే తీశారు.
అదే సమయంలో పేర్ని నాని హౌస్ అరెస్టు అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ఇంటిదగ్గర అసలు పోలీసులే లేరు. గుడివాడ బయులదేరే ప్రయత్నం కూడా పేర్ని నాని చేయలేదు. కానీ వైసీపీ కుట్ర రాజకీయాలన్ని బయట పెట్టినట్లుగా వీడియో రిలీఫ్ చేసుకున్నారు. ఇక ఆయన అంటున్న మాటలన్నీ…తిడుతున్న తిట్లు అన్నీ.. సామాన్య ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. అధికారం పోయినా అసలు అహంకారం తగ్గలేదని అందరూ అనుకునేలా ఉన్నాయి.
లోకేష్ తో పాటు అందరిపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన వల్ల వైసీపీకి నష్టమే కానీ మేలు జరిగే అవకాశాల్లేవు. కావాలని కూటమికి మేలు జరిగేలా.. వైసీపీ ఇమేజ్ ను మరింత బద్నాం చేసేలా పేర్ని నాని రోజు రోజుకు రెచ్చిపోతున్నారని.. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అసలు పేర్ని నాని మనుసులో ఏముందో ?