నిండా ముఫ్పై ఏళ్ల నిండకుండానే వందలకోట్ల ప్యాకేజీలు అందుకుంటున్నారు ఏఐ ఇంజినీర్లు. దీనికి కారణం మార్క్ జుకర్ బెర్గ్. మెటా ఏఐలో ఇప్పటి వరకూ తనదైన ముద్ర వేయలేకపోయింది. అందుకే జుకర్ బెర్గ్ ఇతర ఏఐ సంస్థలోని ఇంజినీర్లను తీసుకుని వందల కోట్లు చెల్లిస్తోంది. చేరినందుకే సైనింగ్ బోనస్‌ల కింద లక్షల డాలర్లు ఇస్తున్నారు.
బేస్ శాలరీలకు అదనంగా స్టాక్ ఆప్షన్స్, సైన్-ఆన్ బోనస్‌లు , ఇతర ప్రోత్సాహకాలతో. ఏఐ ఇంజనీర్లను మెటా ఆకర్షిస్తోంది. ట్రాపిట్ బన్సల్ అనే భారతీయ ఏఐ ఇంజనీర్‌కు.. రూ.800 కోట్లు ఆఫర్ చేసి.. ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలోకి చేర్చుకున్నారు. అలాగే మరో చైనీస్ ఇంజినీర్ కు రూ.1600 కోట్లు ఆఫర్ చేసి చేర్చుకున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా టాప్ ఏఐ టాలెంట్‌ను రిక్రూట్ చేస్తున్నారు, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్ వంటి పోటీదారుల నుండి రీసెర్చర్లను ఆకర్షిస్తున్నారు. ఓపెన్ఏఐ నుండి ఏడుగురు రీసెర్చర్లను తీసుకున్నారు. స్కేల్ ఏఐ సీఈఓ అలెక్సాండర్ వాంగ్‌ను ఆకర్షించారు. స్కేల్ ఏఐను లక్షన్నర కోట్ల వరకూ ఖర్చు పెట్టి సగాని కంటే తక్కువ వాటాను కొన్నారు.
జుకర్‌బర్గ్ టాప్ టాలెంట్‌ను గుర్తించి, వారికి వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నారు. ఈ ప్రక్రియలో “రిక్రూటింగ్ పార్టీ” అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ ఎక్జిక్యూటివ్లతో చర్చలు జరుపుతున్నారు. – మెటా కొత్తగా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ను స్థాపించారు. ఏఐ రంగంలో అద్భుతాలు చేయాలని అనుకుంటున్నారు. మెటా ఆఫర్లతో సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్ కోసం పోటీ అత్యంత తీవ్రంగా మారింది. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఏఐ ఇంజినీర్లు జారిపోకుండా భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మెటా ప్రయత్నాలను ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ విమర్శిస్తున్నారు.
ఓ వైపు కోడింగ్ చేసే వాళ్లను తొలగిస్తున్న మెటా, గూగుల్ వంటి సంస్థలు… ఏఐ రీసెర్చర్లకు ఊహించనంత మొత్తం ఆఫర్ చేస్తున్నారు.