వ్యవస్థలు ఏమైపోయాయో అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్ పెట్టారు. కొంత మంది స్వలాభం కోసమే పని చేస్తున్నాయన్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని కూడా అన్నారు. ఇదంతా ఉప్పాల హారిక అనే మహిళా నేత చేసిన నాటక రాజకీయం విషయంలోనే. పేర్ని నాని ఎలా చేద్దామని ఫోన్ లో చెప్పారో..అదంతా బయట పడినా.. ఏ మాత్రం సిగ్గుపడకుండా అదే కథను ప్రెస్ ముందుకు వచ్చి చెబుతున్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు.. సజ్జల కూడా పెట్టారు. దాడులు చేసింది కాకుండా.. రివర్స్ లో తమపై కేసులు పెట్టారని అంటున్నారు. కానీ అసలేం జరిగిందో నిజమంతా వీడియోల రూపంలో ఉంది కదా !
పేర్ని నాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అందర్నీ కించ పరుస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. కానీ ఆయనను అరెస్టు చేయడం లేదని బాధపడుతున్నారు. ఆయన ఒక్కడినే రాజకీయ పరమైన అరెస్టులు ఏమీ చేయడం లేదు. కేవలం స్కాముల్లో దొరికిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారు. రాజకీయపరమైన అరెస్టులు చేయడం లేదు. ఆ అరెస్టులు చేస్తే.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని.. రెచ్చిపోదామని వైసీపీ ప్లాన్ చేసుకుంటుందేమో కానీ.. అలాంటి అవకాశం రానివ్వడం లేదు.
ఏపీలో చెత్త పరిపాలన సాగుతోందని సజ్జల చెప్పుకొచ్చారు. మంచి పరిపాలన చెత్తగా అనిపించడానికి కారణం ఉంటుంది. అసలు పరిపాలన అంటే.. ఎంత చెత్తగా ఉంటుందో వారి పాలనలో ప్రజలు చూశారు . అదే పాలన అని ఆయన అనుకుంటున్నారు. అందుకే చెత్త పాలన అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి జరుగుతున్న రాజకీయం అర్థం కావడం లేదో.. ఇంకా ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారో ఆ పార్టీ క్యాడర్ కు అర్థం కావడం లేదు.