ఒకప్పుడు సాక్షి పేపర్లో పిట్టకథలు రాసి జనాల్ని బాగా ఆకట్టుకునేవాళ్లు. జగన్ గురించి.. జగన్ ఔదార్యం గురించి.. ఆయన ధీరత్వం గురించి.. ఆయనకు జనాల్లో ఉన్న అభిమానం గురించి రాసే రాతలు చూస్తే..అబ్బో చేయి తిరిగిన రచయితలు సాక్షి నిండా ఉన్నారని అనుకునేవారు. అప్పట్లో అది నిజమే. కానీ కుల, ప్రాంతీయ అభిమానంతో.. ఆ రచయితలందర్నీ పంపేసి.. తోకలున్నవారిని పెట్టుకున్నారేమో కానీ.. జగన్ ను పొగుడుతున్నామనుకుని కూటమిని పొగిడేస్తున్నారు. దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.
తాజాగా సాక్షిలో .. ఎంత పని సేచ్చివయ్యా జగనూ అంటూ ఎవరో సిమ్మాదిరప్పన్న పేరుతో .. ఓ ఫ్లెక్సీని అడ్డం పెట్టుకుని ఓ కథ రాసేశారు. ఆ కథ నిండా కూటమి అన్ని పనులు చేస్తోంది.. అన్ని పథకాలు అమలు చేస్తోంది.. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా జగన్ ను చూసే.. చంద్రబాబు చేస్తున్నారని క్రెడిట్ ఇచ్చారు. చివరికి.. అచ్చం జగన్ పాలనలానే ఉందని ప్రజలు అనుకుంటున్నట్లుగా తీర్పిచ్చేశారు. అంటే.. జగన్ రెడ్డి పాలన అద్భుతం అని వారు అనుకుంటూ ఉంటే..దానికి తగ్గట్లుగానే పాలన సాగుతోందన్నమాట.
మరి పాలన బాలేదు.. చెత్తగా ఉందని.. సజ్జల లాంటి వాళ్లు వచ్చి ప్రెస్మీట్ పెట్టి గగ్గోలు పెట్టడంలో ఏం అర్థం ఉంది. సాక్షి పత్రిక ఇప్పుడు ఏం రాసినా.. ఎవరూ నమ్మడం లేదు. అసలు నిజం కోసం.. వైసీపీ క్యాడర్ కూడా వేరే పత్రికల్ని చూడాల్సి వస్తోంది. లేకపోతే సోషల్ మీడియా మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు ఇాలంటి పిట్టకథల్ని కూడా కూటమి పాలనను పొగిడేందుకు రాస్తే.. వైసీపీ క్యాడర్ ఏమైపోవాలా..? ఏమయ్యా సజ్జలా.. ఓ సారి చూసుకోబళ్లా ?