AI ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చేసింది… ఇక ఉద్యోగాలు ఉండవు అని కొంత మంది లబోదిబోమంటున్నారు. భయపెట్టడమే అసలైన జర్నలిజం అనుకునే పరిస్థితి వచ్చాక మరింత పెరిగింది. కానీ ఏఐ విజృంభణ అనేది ఓ అవకాశాల గని అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఏఐతో పనులు సులువుగా అయిపోతాయి కానీ.. అన్నీ ఏఐనే చేసి పెట్టదు. వాటితో చేయించుకోవాల్సింది కూడా మనుషులే. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే..ఏఐని ఉపయోగిచుకుని తమ స్కిల్ పెంచుకుని ఏ ఉద్యోగంలో అయినా సర్వైవ్ అయిపోతారు.
ప్రాథమిక స్థాయిలోనే ఏఐ ప్రభావం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఇది అంత నమ్మకమైనదిగా ఇంకా ప్రపంచం చూడటం లేదు. ఏఐ ఏ పని చేసినా..దాన్ని క్రాస్ చెక్ చేసుకుని సరిగ్గా చేసిందా లేదా అన్నది చూసుకునే వాడుతున్నారు. సాధారణంగా సెర్చ్ చేసే వారికి ఇప్పుడు గూగుల్ కన్నా.. ఏఐ టూల్స్ బెటర్ గా ఉపయోగపడుతున్నాయి. కానీ గూగుల్ లో కాకుండా.. సొంతంగా వివరాలను ఏఐ తయారు చేస్తోంది. ఇందులో అవాస్తవ సమాచారం కూడా ఎక్కువే ఉంటోంది. దీన్ని సరి చేసుకోవాల్సింది ఉపయోగించుకుంటున్న వారే.
ఏఐని వాడుకోవడం ఓ కళ
ఏమని ఉపయోగించుకోవడం కూడా ఇప్పుడు ఓ కళ. దాని మీదే ఆధారపడితే ఉన్న స్కిల్ పోతుంది. కానీ దాన్ని ఉపయోగించుకుని భరితంగా రాటుదేలే అవకాశం మాత్రం ఏఐ ఇస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపైనే ఉద్యోగభద్రత ఉంటుందని అనుకోవచ్చు. ఏఐని వాడుకుని మరింత మెరుగైన అవుట్ పుట్ ఇస్తామన్న నమ్మకం కలిగేలా చేసుకోవాలి. అదే సమయంలో ఏఐని వాడటం తప్పు అనే భావనకు రాకూడదు. కావాల్సింది అత్యుత్తమ అవుట్ పుట్. ఏఐని వాడుకుని మెరుగైన ఉత్పత్తిని ఇస్తే అది ప్రయోజనం. కానీ దాని మీదే ఆధారపడితే మాత్రం అది డిజాస్టర్ అవుతుంది.
ఏఐ స్కిల్స్ పెంచుకుంటే ఎన్నో అవకాశాలు
ఏఐ రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరూ తమ తమ కెరీర్లలో ఏఐని అప్లయ్ చేసుకునేలా స్కిల్స్ పెంచుకుని ముందుకెళ్తే ఒక్క ఉద్యోగం పోదు సరికదా.. కొత్త అవకాశాలు పుట్టుకు వస్తాయి. మైక్రోసాఫ్ట్ అయినా.. ఇతర బడా కంపెనీలు అయినా.. లేఆఫ్ ప్రకటిస్తోంది.. కాలం తీరిపోయిన కోడింగ్ పనుల్ని చేసుకుంటూ… స్కిల్స్ పెంచుకోనివారికే. పనికి వస్తారనుకున్న ఎవర్నీ ఏ కంపెనీ వదులుకోలేదు. అందుకే.. స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఏఐని వాడుకోవాలి కానీ.. దానిపైనే ఆధారపడకూడదు.