భారత రాష్ట్ర సమితి, వైసీపీ మధ్య రాజకీయ అనుబంధం, మిత్రుత్వం గురించి చెప్పాల్సిన పని లేదు. వీరి రాజకీయ స్నేహంలో ఆర్థిక సహకారం కూడా చాలా కీలకమని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి లింక్ ఒకటి బయటడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉండి.. సుదీర్ఘ కాలం దేశం బయట గడిపి తిరిగి వచ్చిన సునీల్ రావు కు.. ఈ లిక్కర్ కేసులో లింక్ ఉన్నట్లుగా బయటపడింది.
సునీల్ రావు తన భార్యతో పాటు మరో వ్యక్తి పేరు మీద దుబాయ్‌లో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. దాన్ని తనతో పాటు ఫ్లాట్ కొన్న వ్యక్తిని మోసగించడానికి ఓ రెంటల్ ఎజెన్సీకి ఇచ్చారు. కానీ వెంటనే ఆ రెంటల్ ఏజెన్సీ నుంచి తన భార్య పేరుతోనే లీజుకు తీసుకున్నారు. అంటే ఇక ఇల్లు అద్దెకు ఇచ్చేసినట్లుగా.. .. ఆ ఫ్లాట్ లోకి సహకొనుగోలుదారు రాకుండా ఉండేలా చూసుకున్నారన్నమాట.
ఇక ఆ ఫ్లాట్ ను.. శ్రవణ్ రావు ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు షెల్టర్ కోసం ఇచ్చారు. ఆయన అద్దెకు ఇచ్చారా లేకపోతే.. ఈ స్కాంలో డబ్బులు రూటింగ్ చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారా అన్నది తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న సమయంలో దుబాయ్ లో చాలా రోజుల పాటు అదే ఫ్లాట్ లో లిక్కర్ నిందితులతో కలిసి శ్రవణ్ రావు ఉన్నారని.. ఫ్లాట్ సహ ఓనర్ ఆధారాలతో సహా ఏపీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న సిట్ కు ఫిర్యాదు చేశారు కూడా. ఆయన సిట్ ముందు హాజరై అధికారికంగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
శ్రవణ్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఏడాదికిపైగా విదేశాల్లో బతికేసి..అరెస్టు నుంచి రక్షణ పొంది ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయితే ఆయనపై ఇతర నేరాలు ఉండటంతో అరెస్టు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఆయన పాత్ర ఉన్నట్లు తేలితే.. బీఆర్ఎస్, వైసీపీ మధ్య లిక్కర్ బంధం కూడా గట్టిగా ముడిపడిందని అర్థం చేసుకోవచ్చు.