నిండు అసెంబ్లీలో ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిత్వంపై రోజా చేసిన అత్యంత దారుణమైన కామెంట్లు అందరూ విన్నారు. ఆ కామెంట్లను పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తుల చేసిన వ్యక్తిత్వ హననం గురించి చెప్పాల్సిన పని లేదు. రోజా ఒక్క అనిత పై కాదు.. ఆమె బూతుల్ని వినని వారు ఏపీలో లేరు. ఓ మహిళ ఇలా మాట్లాడుతారా అని ఆశ్చర్యపోతారు. అలాంటి రోజా ఇప్పుడు తనపై నగరి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
నగరిలో ఇసుక తరలిస్తున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. వారు రోజా అనుచరులు. రోజా సోదరుడు ఈ ఇసుక మాఫియా ముఠాకు నాయకుడన్న పేరు ఉంది. ఇసుక లారీల్ని సీజ్ చేసి.. కౌన్సిలర్లను అరెస్టు చేశారని తెలియగానే రోజా నగరిలో దిగిపోయారు. గాలి భానుప్రకాష్ పై బూతులందుకున్నారు. అనాల్సిన మాటలన్నీ అన్నారు. ఈ మాటలకు కౌంటర్ గా గాలి భానుప్రకాష్ కూడా మండిపడ్డారు. రూ. రెండు వేలకు సినిమాల్లో వేషాలేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలన్నారు. కానీ భానుప్రకాష్ .. రెండు వేలకు తాను అన్ని పనులు చేస్తానని అన్నారని అది తనను అవమానించడమేనని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వదిలి పెట్టేది లేదన్నారు.
కానీ ఓ టీవీ చానల్ డిబేట్ లో బండ్ల గణేష్ అంత కంటే ఘోరంగా రోజాను తిట్టారు. రోజా తిట్టబట్టే రివర్స్ లో తిట్టారు. ఎక్కైడైనా రోజా మాటల్ని బట్టే ఇతరులు కౌంటర్ ఇస్తారు. అప్పుడు బండ్ల గణేష్ తన క్యారెక్టర్ ను కించ పరిచారని రోజా కేసు పెట్టలేదు. లైట్ తీసుకున్నారు. తర్వాత నవ్వుతూ ఇద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో కనిపించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. రోజా విషయంలో తనను ఎవరైనా తిట్టారు అని .. అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు చేస్తే.. నవ్వుకుంటారు. ఎందుకంటే అసభ్యకరమైన మాటల్లో ఆమె ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి..!