ఏఆర్ రెహమాన్ లైవ్ షోను చూడాలని కోరిక ఆయన సంగీతాన్ని ఆస్వాదించే అభిమానుల్లో ఉండడం సహజం. ఆయన లైవ్ షోలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2017లో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక లైవ్ షో పెట్టారు. అది సక్సెస్ఫుల్ అయింది. చాలామంది అభిమానులు, ముఖ్యంగా యూత్ ఆ లైవ్ షోకి హాజరయ్యారు.
ఇప్పుడు నవంబర్ 8న రెహమాన్ లైవ్ షో హైదరాబాద్ ముస్తాబవుతోంది. అయితే ఈసారి వేదిక రామోజీ ఫిలింసిటీ. పైగా టికెట్ రేట్లు కూడా గట్టిగా ఉన్నాయి. సహజంగా రెహమాన్ లైవ్ షోలకి టికెట్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈసారి సామాన్యుడికి, ముఖ్యంగా యూత్‌కి అందుబాటులో ఉన్నట్టు అనిపించడం లేదు.
ఈ లైవ్ షోకి స్టార్టింగ్ టికెట్ ధర జీఎస్టీతో కలుపుకొని దాదాపు 2000. బేసిగ్గా లైవ్ షోలకి టికెట్ రేట్లు 900 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఒక గంట పెట్టి ‘సోల్డ్ అవుట్’ చూపిస్తారు. కానీ ఈసారి డైరెక్ట్‌గా రూ. 2000 నుంచి పెట్టారు. పైగా రామోజీ ఫిలింసిటీ అందరికీ అందుబాటులో ఉన్న వేదిక కాదు.
నిజానికి రెహమాన్ లైవ్ షోలు చెన్నైలో జరిగితే 500, 900 నుంచి కూడా టికెట్లు ధరలు మొదలవుతాయి. గతంలో హైదరాబాద్ ఈవెంట్లో టికెట్ రూ.900 కూడా ఉండేది. కానీ ఈసారి ఈవెంట్‌కి వచ్చేసరికి 2000 నుంచి మొదలైంది. బడ్జెట్లో రెహమాన్ లైవ్ షోను ఎంజాయ్ చేద్దాం అనుకునే చాలా మందికి ఈ రేట్లు నిరాశ కలిగించేవే.