ఏపీ రాజధాని అమరావతి APCRDA పరిధిలోకి వస్తుంది. కానీ సీఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో భూసమీకరణ చేయలేదు. సీఆర్డీఏ పరిధి కృష్ణా, గుంటూరు, NTR, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలలో 8,352.69 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇందులో 58 మండలాలు ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. గుంటూరు జిల్లాలో మేడికొండూరు, పెదకూరపాడు వవరకూ సీఆర్డీఏ పరిధిలోనే ఉంటాయి. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలో 217.23 చ.కి.మీలో ఉంది. ఇందులో 34 గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ సీఆర్డీఏ పరిధిలో లే ఔట్లకు సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోవాలి.
కృష్ణా , గుంటూరు జిల్లాలలో CRDA పరిధిలో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూస్ లే-ఔట్లకు APCRDA నుండి అనుమతి తప్పనిసరి. CRDA ఆమోదం లేని లే-ఔట్లు చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. లే-ఔట్ ప్లాన్లు CRDA జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లకు అనుగుణంగా ఉండాలి, ఇందులో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాలు ఉంటాయి 2015లో, CRDA పరిధిలో 829 అనధికార లే-ఔట్లు గుర్తించింది. అమరావతి, తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో అనధికార లే-ఔట్లు ఎక్కువగా ఉన్నాయి.
CRDA వెబ్సైట్లో 2015 నుండి ఆమోదిత లే-ఔట్ల జాబితా అందుబాటులో ఉంది . CRDA పరిధిని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్స్టిట్యూషనల్ జోన్లుగా విభజించింది. లే-ఔట్లు ఈ జోనింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఉదాహరణకు, R-5 జోన్‌ను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా సృష్టించారు, ఇందులో గుంటూరు, NTR జిల్లాలకు 1,134 ఎకరాలు మరియు అదనంగా 268 ఎకరాలు కేటాయించారు. CRDA పరిధిలో లే-ఔట్లు ఇన్నర్ రింగ్ రోడ్ (217 కి.మీ), ఔటర్ రింగ్ రోడ్ (189 కి.మీ), కరకట్ట రోడ్ (నాలుగు లేన్ల విస్తరణ), కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జ్‌లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లతో అనుసంధానిస్తారు.
సీడ్ క్యాపిటల్ తో మొత్తం సీఆర్డీఏ అనుసంధానమయ్యేలా ఇన్ ఫ్రాంచైజీ డెలవప్ చేస్తున్నారు. అందుకే…. జగ్గయ్యపేట నుంచి రాజధాని పరిధి ప్రారంభమవుతుంది. గుంటూరు శివారు వరకూ ఉంటుంది. ఇలాంటి చోట్ల పూర్తిగా సీఆర్డీఏ అనుమతి ఉన్న ప్లాట్లనే కొనుగోలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.