ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ ఒకటే టైటిల్‌తో అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. పలకడానికి ఇబ్బందిగా ఉండే టైటిల్స్ ని కూడా అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాని కూడా అన్ని భాషల్లో అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలని అనుకున్నారు. నిజానికి కింగ్డమ్ అనేది అన్ని భాషలవారు పలకడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ హిందీ వర్షన్లో ఈ సినిమాని కింగ్డమ్ అనే టైటిల్‌తో రిలీజ్ చేయడం లేదు.
ఇదే టైటిల్ హిందీలో ఇప్పటికే రిజిస్టర్ అయింది. హిందీలో టైటిల్ రిజిస్ట్రేషన్ నియమాలు చాలా పకడ్బందీగా ఉంటున్నాయి. తెలుగులో అయితే అదే టైటిల్ రిజిస్టర్ అయి ఉంటే హీరో పేరు, నిర్మాత లేదా దర్శకుడు పేరు పెట్టి (ఉదాహరణకు మహేష్ ఖలేజా) రిలీజ్ చేయడం జరిగేది. కానీ హిందీలో అలా కుదరడం లేదు. దీంతో సామ్రాజ్య అనే పేరుతో హిందీలో రిలీజ్ కాబోతుంది.
లైగర్ సినిమా తర్వాత విజయ్ నుంచి హిందీకి వెళుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో కంటెంట్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. నార్త్ బెల్ట్‌లో కూడా సినిమాని డీసెంట్ స్క్రీన్స్‌లోనే రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు గౌతమ్ హిందీ డబ్బింగ్‌పై కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.