ఏపీలో 199 మంది పోలీసులకు పోస్టింగులు, జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి.. ప్రధాని దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరికీ లేఖలు రాశారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని అందులో చెప్పుకొచ్చారు. ఈ 199 మందిలో ఐపీఎస్ అధికారులు నలుగురే ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అంటే జగన్ సేవలో మునిగితేలి..అప్పటి ప్రతిపక్ష నేతలను వేధించిన వారంతా ఇప్పుడు పోస్టింగులు తెచ్చుకున్నారు. నలుగు ఐపీఎస్లకు మాత్రమే పోస్టింగులు రాలేదు.
అదే సమయంలో 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు , 119 మంది సీఐలు ఈ జాబితాలో ఉన్నారని వీరందర్ని వీఆర్లో ఉంచారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ కోసం ఎంతో తీవ్రమైన తప్పులు చేసిన వాళ్లే వీళ్లంతా. వీరిని అప్పటికీ అవసరమైన సమయాల్లో ఉపయోగించుకుంటున్నారని కూడా తెలిపారు. ఇక వీఆర్ లో ఉంటే.. జీతం వస్తుందా రాదా అన్నది పోలీసు శాఖలో అందరి్కీ తెలుసు. ఎలాగైనా వీళ్లందర్నీ పోలీసు శాఖలో పోస్టింగుల్లో చేర్చి.. తమ కుట్రలు అమలు చేయాలనుకుంటున్నారు.
వైసీపీ హయాంలో వీఆర్ లో ఉన్న పోలీసులు ఇప్పుడు గురుమూర్తి చెబుతున్న 199 మంది కంటే మూడింతలు ఎక్కువగా ఉంటారు. ఓ కులాన్ని టార్గెట్ చేసుకుని ఆ కులం వాళ్లెవరూ పోలీసుల్లో ఉండకూడదన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు .. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్లకు మాత్రమే పోస్టింగులు లేవు. వారి నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుందో లేకపోతే.. తమ వల్ల అందరూ బలైపోయారని ఫీలవుతున్నారో కానీ.. కనిపించిన వారందరికీ ఫిర్యాదులు చేస్తున్నారు.