కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామాన సాగుతున్న కార్యక్రమం. ప్రతి ఇంటిని టచ్ చేసేలా సాంకేతికత మేళవించి కార్యక్రమం
ఏడాది పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాలు, విలువైన సలహాలు తీసుకుంటున్న నాయకులు
గత 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ఇళ్లకు టీడీపీ శ్రేణులు
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి ఆత్మీయ స్పందన
అమరావతి:విధ్వంస పాలనకు చరమగీతం పాడి సుపరిపాలన వైపు అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సూపర్ 6 పథకాల్ని ప్రజలకు అందిస్తోంది. ఓవైపు సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజన్ 2047తో దూసుకుపోతోంది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో ఏడాది ప్రజాపాలన గురించి, అందుకున్న విజయాల గురించి ప్రజలకు వివరిస్తూనే..పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం అందిస్తున్న అని పథకాలు వారికి అందుతున్నాయా లేదా, ఇంకా ఈ ప్రజా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు లాంటి అంశాల గురించి తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. జులై 2న కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంగళగిరిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
50 లక్షలకు పైగా ఇళ్లు, అన్ని నియోజకవర్గాల్లో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి విజన్‌ను వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తున్నారు. అంతేకాకుండా… ఆయా కుటుంబాలకు అందుతున్న పథకాల గురించి కూడా తెలుసుకుని… ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి పథకాల్ని, కార్యక్రమాలను ఆశిస్తున్నారు లాంటి అంశాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి సరికొత్త రికార్టుని సృషించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ మరోసారి నిరూపించినట్లైంది.
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు పింఛన్లు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, దీపం 2 పథకం వంటి వాటిగురించి ప్రజలకు వివరిస్తున్నారు.
• ఆ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేస్తున్నారు.
• ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు గురించి చెపుతున్నారు.
• పెట్టుబడుల ద్వారా మన యువతకు అందివస్తోన్న ఉద్యోగాకవకాశాలు తెలియజేస్తున్నారు.
• ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు.
• రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తున్నారు
• ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు.