మిథున్ రెడ్డి అరెస్ట్ అనంతరంలో వైసీపీలో నిశ్మబ్దం ఆవరించింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. మిథున్ రెడ్డి అరెస్టుపై జగన్ బెంగళూరు లో ఉండి ఓ ట్వీట్ పడేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి శాపాలు పెట్టారు. రాజమండ్రిలో జైలు వద్దకు జన సమీకరణ చేయాలని.. జక్కంపూడిలాంటి వారికి ఆదేశాలు ఇస్తే కొంత మందిని పోగేశారు. అంతా అయిపోయాక..ఇప్పుడు ఏం చేయాలో వైసీపీలో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.
మహా అయితే రెండు నెలలు జైల్లో ఉండి బయటకు వస్తారులే ఏమీ కాదని సర్ది చెప్పుకుంటున్నారు కానీ.. తర్వాత అరెస్టయ్యేది జగనే అన్న ప్రచారంతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో వైసీపీ పెద్దలకూ అర్థం కావడం లేదు. అరెస్టు అయి జైలుకెళ్తే సానుభూతి వస్తుందని కూడా ఆశలు పెట్టుకోలేరు. ఎందుకంటే జరిగింది చిన్న స్కాం కాదు. ప్రజల రక్త మాంసాలు పీల్చిన స్కామ్. ప్రజలందరికీ అ స్కామ్ పై స్పష్టత ఉంది. జగన్ అరెస్ట్ అయిన తర్వాత ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయకపోతే పరువు పోతుంది. ప్రస్తుతం జగన్ కోసం ఎవరూ రోడ్డెక్కే పరిస్థితి లేదు.
లిక్కర్ కేసులో సీఐడీ ఏం చేస్తోంది… ఎలాంటి అడుగులు వేస్తోందని లిక్కర్ బ్యాచ్‌కు అర్థం కావడం లేదు. సిట్ టీం దుబాయ్‌కు కూడా వెళ్లి వివరాలు తెలుసుకుని వచ్చింది. ప్రతి రూపాయి ఎటు నుంచి ఎటు వెళ్లిందో కనిపెట్టింది. చివరికి ఎన్నికల సమయంలో కొన్ని వందల మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు, యూట్యూబర్లకు కూడా నగదు రూపంలో లక్షలు ఇచ్చారు. వాటి వివరాలు కూడా వెలుగులోకి తెస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. వీటన్నింటిని ఎలా ఎదుర్కోవాలో.. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఎలా ప్రజల్ని నమ్మించాలో తెలియక కిందా మీద పడిపోతోంది వైసీపీ నాయకత్వం.