కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భూముల్లో అనుచిత లబ్ది జరిగిందంటూ ఈడీ అధికారులు పెట్టిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు ఓటర్ల ముందు జరగాలి కానీ ఈడీ ఇందులో ఎందుకు భాగమవుతోందని ప్రశ్నించింది. ఈడీ తరపున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజుకు ఘాటు హెచ్చరికలు పంపింది. మమ్మల్ని ఏమీ మాట్లాడేలా బలవంతం చేయవద్దు… లేకపోతే మేము ఈడీ గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయవలసి ఉంటుందని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు.
కోర్టు ఈడీ చర్యలను “రాజకీయ ఉద్దేశంతో” కూడినవిగా స్పష్టం చేసినట్లయింది. , “ఈ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాపింపజేయవద్దు,” అని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ హెచ్చరించారు, ఈడీ రాజకీయ దుర్వినియోగం ఇతర రాష్ట్రాలకు వ్యాపించకూడదని సూచించారు. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాటిని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పులో ఎటువంటి తప్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ క్క అప్పీల్‌ను తిరస్కరించింది.
2010లో సిద్దరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జునస్వామి 3.2 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. MUDA ఈ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత, పార్వతికి పరిహారంగా మైసూర్‌లోని ఖరీదైన ప్రాంతంలో 14 సైట్లు కేటాయించారు. ఇవి ఎక్కువ విలువైనవని ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు ఈ కుంభకోణం విలువ రూ. 3,000-4,000 కోట్లు ఉంటుందని ఆరోపించాయి. లోకాయుక్త నుంచి ప్రారంభించి ఈడీ వరకూ ఈ కేసులు వెళ్లాయి. ఓ దశలో సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్లు కూడా వినిపించాయి.
ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో.. రాజకీయ ప్రేరేపిత ఈడీ కేసులు.. తేలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. మనీ ట్రాన్సాక్షన్సే లేని గాంధీ కుటుంబానికి చెందిన మీడియా సంస్థ కేసులు సలా.. చాలా కేసుల్లో ఈడీ దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది.