హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలా జరిగింది. ఈ ఈవెంట్ ప్రమోషన్లకు బాగా బూస్టప్ ఇచ్చింది. ఈ రెండు రోజులు కూడా వీరమల్లు ప్రమోషన్లు ఈ రేంజ్లోనే సాగే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ లో పవన్ స్పీచ్ హైలెట్ అయితే… కీరవాణి ఇచ్చిన సర్ప్రైజ్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సినిమాకు కీరవాణి పని చేయడం ఇదే తొలిసారి. పైగా.. పవన్ అంటే కీరవాణికి ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానాన్ని ప్రీ రిలీజ్ వేడుకపై చాటుకొన్నారు కీరవాణి. పవన్ సినిమా టైటిళ్లలో ఓ పాటని కంపోజ్ చేసి, అది వేదికపై తన సింగర్స్ తో ఆలపించారు. అసలు ఇలాంటి ఓ పాట ఉంటుందని దర్శక నిర్మాతలకు కూడా తెలీదు. పవన్ ఫ్యాన్స్ తో పాటు, చిత్రబృందం కూడా ఈ పాట విని షాక్ అయ్యింది. పవన్ అభిమానులు ఈ పాట వింటూ.. పూనకం వచ్చినట్టు రెచ్చిపోయారు.
కీరవాణి బృందం ఆలపించిన పాట ఇదే..
”గోకులంలో సీత వెదికింది
అత్తారింటికి దారేదని…
అక్కడ అమ్మాయికి
ఇక్కడ అబ్బాయి దొరికితే.. ఖుషి!
తమ్ముడూ.. హే తమ్ముడూ
ఎక్కడున్నాడు ఆ కాటమరాయుడు
తమ్ముడూ… హే తమ్ముడూ
ఆ అజ్ఞాతవాసిని వెదికి పట్టుకో నేడు
పులి పంజాకైనా దొరకని గబ్బర్ సింగ్ వాడూ
సర్దార్ గబ్బర్ సింగ్ వాడూ..
బెదిరిస్తే వస్తాడా.. నెవ్వర్
హీ హీజ్ గుడుంబా.. శంకర్
పెరిగిపోతోందిక్కడ… ఫీవర్
కొట్టుకో.. కొట్టుకో.. తీన్ మార్
మా బంగారానికి నీపై తొలిప్రేమ పుట్టింది బ్రో..
ఈ వకీలు సాబే తన లైఫ్లోన జానీ అంటోంది బ్రో..
ఈ బాలుని.. ఈ బద్రిని.. ఈ భీమ్లా నాయక్ని
గోపాల గోపాల మాంగళ్యమంత్రాల
అన్నవరంలో పెళ్లాడు మంత్రాల జల్సాల
వేదికకి సుస్వాగతం..
ఆ సునామికి సుస్వాగతం..
ఇది అరాచకం.. ఇది అరాచకం
రాంబాబూ… నువ్వు రెడీ అయిపో
నీ కెమెరాతో.. నువ్వు రెడీ అయిపో
ఆ గంగతో.. ఇక రెచ్చిపో..
వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడహో.. వచ్చేశాడొచ్చేశాడోచ్చేశాహో…
ఎవ్వడూ… హరిహర వీరమల్లు…!”
ఆల్బమ్ లో ఇలాంటి పాట ఉందని ఎవ్వరికీ తెలీదు
ఈ పాట పేరు జులై 24#MMKeeravani #HariHaraVeeraMallu pic.twitter.com/IDt2LG27I3
— Telugu360 (@Telugu360) July 21, 2025