రాజకీయాల్లో ఏం చేసినా ప్రజాభిప్రాయం కీలకం. అందుకే రాజకీయ పార్టీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కాం అంశం కలకలం రేపుతోంది. ఇలాంటి అంశంపై ప్రజలేమనుకుంటున్నారో రాజకీయ పార్టీలు ఆరా తీస్తాయి. మీడియాలో వచ్చే కథనాలే కాదు.. సామాన్య జనం స్పందన కూడా రాజకీయ పార్టీలు రహస్యంగా అయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. దానికి తగ్గట్లుగా నిర్ణయాలను మార్చుకుంటాయి. లిక్కర్ స్కాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వైసీపీ తెలుసుకుని ఉంటే.. తాము ఎంత తప్పు చేశామో .. ఇప్పటికైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
లిక్కర్ స్కామ్‌లో దోపిడీ జరిగిందని వంద శాతం ప్రజల నమ్మకం
లిక్కర్ స్కామ్‌పై ఏపీ ప్రజల్లో ఓ స్పష్టత ఉంది. వంద శాతం తమ ఆరోగ్యాలను సైతం దోపిడీ చేశారని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఏపీలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగిన ఒక్కరు కూడా.. పాపం అనడం లేదు. ఇంతేనా.. ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారికి పార్టీలతో సంబంధం లేదు. అందరిదీ అదే అభిప్రాయం. జగన్ రెడ్డిని అభిమానించి ఓటేసినంత మాత్రాన.. తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి దోపిడీ చేస్తారా అన్న కోపం వారిలో ఉంది. లిక్కర్ స్కామ్‌లో ఎలా దోపిడీ జరిగిందో బయటకు వస్తూంటే.. అంతా విస్మయానికి గురవుతున్నారు.
చర్యలు తీసుకోకపోతేనే ప్రజాగ్రహం
అసలైన బ్రాండ్లు అందుబాటులో ఉంచకుండా కేవలం ఇమిటేషన్ బ్రాండ్లు, నకిలీ లిక్కర్ బాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచినప్పుడే అందరికీ ఇందులో జగన్ రెడ్డి దోపిడీ ప్లాన్ ఉందన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల్లో ఆ కోపం చూపించారు. ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉంటే ఒక్కరు కూడా వ్యతిరేకించడం లేదు. కనీసం రాజకీయ కక్ష సాధింపు అనుకోవడం లేదు. చట్ట ప్రకారం వాళ్లను శిక్షించకపోతే రేపు ఇంకా ఘోరాలు జరిగిపోతాయనే అనుకుంటున్నారు. అందుకే జగన్ ను అరెస్టు చేసినా స్పందన రాదని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.
జగన్ ను అరెస్టు చేసినా స్పందన ఉండదు !
జగన్ ను అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయాలని వైసీపీ పెద్దలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ క్యాడర్ ఇప్పటికే సైలెంటుగా ఉంది. యాక్టివ్ కావడం లేదు. పరిస్థితి ఘోరంగా ఉందని.. జగన్ కూ తెలుసు. అందుకే.. రెండువేల మందితో ప్రదర్శనలు చేసేవారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అలా ఎంత మందికి ఇస్తారని చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. అందుకే ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. జగన్ కోసం ఇప్పుడు తల్లి, చెల్లి కూడా రావడం లేదు. వారు కూడా ఆయన అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వేరే వాళ్లు ఎందుకు ఆందోళన చెందుతారు. వైసీపీకి ఇదే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.