ఇల్లు కొనుగోలును చాలా మంది పెట్టుబడిగా చూస్తూంటారు. ఓ ఇల్లు ఉన్నా అద్దెల కోసం అయినా అపార్టుమెంట్ కొనుగోలు చేస్తూంటారు. కానీ కోటిన్నర వరకూ పెట్టుబడి పెట్టి… రూ.40వేలకు అద్దెకు ఇవ్వడం అనేది డబ్బుల్ని వృధా చేయడమేనన్నది ఆర్థిక నిపుణుల అంచనా.
అపార్ట్మెంట్లు ప్రధానంగా నివాసం కోసం ఉండాలి, పెట్టుబడి కోసం కాదని లెక్కల ప్రకారం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరాల్లో, చాలా మంది రెండవ ఇంటిని పెట్టుబడిగా కొనుగోలు చేయడం లాభదాయకం కాదు. భారతదేశంలో గృహ రుణాల వడ్డీ రేట్లు కనీసం ఎనిమది శాతం ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒక 2-BHK అపార్ట్మెంట్ ధర సగటున 50-80 లక్షల రూపాయలు ఉంటుంది. లోన్ మీద నెలకు 40,000-60,000 వరకు ఈఎంఐ కడతారు.
ఇలా కాకుండా.. లిక్విడ్ అసెట్స్ మీద అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ లేకుండా, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి రిస్క్‌ను పెంచుతుంది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని అనేది త్వరగా నగదుగా మార్చడం కష్టం. అదే సమయంలో హైదరాబాద్‌లో, రియల్ ఎస్టేట్ ధరలు 2015-2025 మధ్య సగటున 5-7 శాతం సీఏజీఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర సురక్షిత పెట్టుబడుల్లో 10 నుంచి 12 శాతం CAGR కనిపిస్తోంది.
సామాన్యులకు రెండవ అపార్ట్మెంట్ కొనడం ఆర్థిక రిస్క్‌ను పెంచుతుంది. ధనవంతులకు అయితే ఇది వర్తించదు. మధ్యతరగతి వ్యక్తి ఓ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత రెండో ఇంటి మీద పెట్టుబడి పెట్టే ముందు.. అధిక రిటర్న్‌ల ఆప్షన్ చూసుకోవడం బెటర్.