గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది ఈ క్రమంలో 2వ GCC లీడర్షిప్ కాన్క్లేవ్ నెలాఖరులో జరగనుంది. ఈ కాన్క్లేవ్కు ప్రపంచంలోని దిగ్గజ సంస్థల నుంచి 300 మందికిపైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొంటున్నారు. ఇందులో గ్లోబల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఇండస్ట్రీ అసోసియేషన్లు, టెక్నాలజీ థింక్ ట్యాంక్‌ల నుండి ప్రతినిధులు ఉంటారు.
ఈ కాన్క్లేవ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs)ని కే కాస్ట్-ఎఫిషియంట్ డెలివరీ యూనిట్ల నుండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంజన్లుగా మార్చే అంశంపై చర్చిస్తారు. జనరేటివ్ AI , ఆటోమేషన్ టెక్నాలజీలు GCCలలో విస్తృతం చేయడం, AI-ఆధారిత నైపుణ్యాలు , వర్క్‌ఫోర్స్ డెవలప్మెంట్ సహా ఆయారంగాలకు చెందిన కీలక అంశాలపై చర్చిస్తారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఇండస్ట్రీ అసోసియేషన్లు, ఈవెంట్లో పాల్గొంటాయి.
GCC పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ ఫ్రేమ్‌వర్క్‌లను మెరుగుపరచడంపై చర్చిస్తాయి. Ascendion ఒక డెడికేటెడ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేస్తుంది, ఇందులో జనరేటివ్ AI, ఏజెంటిక్ వర్క్ఫ్లోస్, ఇంజనీరింగ్ ఆటోమేషన్, రియల్-వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ కేస్ స్టడీస్‌ను ప్రదర్శిస్తారు. ఈ కాన్క్లేవ్ భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ ఇన్నోవేషన్ న్యూక్లియస్‌గా మార్చడానికి సహకారం అందిస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందులో జీసీసీ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది.