ఏపీ లిక్కర్ స్కామ్లో సీఐడీ అధికారులు హైదరాబాద్లో దూకుడుగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన భారతి సిమెంట్స్ ఆడిటర్, బాలాజీ గోవిందప్ప .. చాంబర్ లోనూ సోదాలు చేస్తున్నారు.లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతి సిమెంట్స్ లోకి అక్రమంగా వచ్చిందని సీఐడీ అధికారులు గుర్తించారు.
అలాగే రాజ్ కెసిరెడ్డికి చెందిన కొన్ని కార్యాలయాలు, బూనేటి చాణక్య అనే నిందితుడికి చెందిన రెస్టరెంట్ తోపాటు.. డబ్బులను దాచడానికి డెన్లుగా వాడిన ఫ్లాట్లలో కూడా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీటును సీఐడీ అధికారులు దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అసలు లిక్కర్ కమిషన్లలో అత్యధిక భాగం చేరిందని చెబుతున్నారు. వాటి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
లిక్కర్ స్కామ్లో చాలా మంది ఇప్పటికీ విదేశాల్లో దాక్కున్నారు. వారందరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి పట్టుకుని రానున్నారు. త్వరలో ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో భారతి సిమెంట్స్ లో సోదాలు సంచలనాత్మకం అనుకోవచ్చు.