జూలైలోనే తెలుగు రాష్ట్రాల్లోని రెండు అతి పెద్ద ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు రావడంతో మొదట శ్రీశైలం, ఇప్పుడు నాగార్జునసాగర్ కూడా నిండిపోయాయి. ఇంకా ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వస్తూండటంతో మంగళవారం సాగర్ రెండు గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పులిచింతల కూడా నిండిపోతుంది. ఇంకా వర్షా కాలం ప్రారంభంలోనే ఉన్నందున కృష్ణాకు ఇంకా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సారి కూడా కృష్ణా డెల్టాకు నీటి సమస్యసలు ఉండే అవకాశాలు లేవు. గత ఏడాది కూడా ప్రాజెక్టులు నిండటంతో.. కాలువల సౌకర్యం ఉన్న పొలాలకు నీటి సౌకర్యం అందింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీ నీవా పనులను ప్రారంభించడంతో ఆరు పంపుల ద్వారా రాయలసీమకు నీటిని అందిస్తున్నారు. కుప్పం వరకూ ఆ నీరు వెళ్లనున్నాయి. హంద్రీనీవా పనులను జగన్ హయాంలో నిర్లక్ష్యం చేయకపోతే చాలా వరకూ నీరు రాయలసీమకు చేరి ఉండేది.
నీటి వనరుల్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. కృష్ణాకు వరద వచ్చినప్పుడు ఉపయోగించుకుకునేందుకు చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. సాగర్ నిండిపోవడం వల్ల.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు కొన్ని లక్షల ఎకరాలకు నీరందుతుంది. హైదరాబాద్కు నీటి సమస్య తీరిపోతుంది.