టిడిపి ముందు గోయ్యి వెనుక నుయ్యి

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రయివేటు బిల్లుకి తెలుగుదేశం మద్దతు ఇస్తుందో ఇవ్వదో స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు!

కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి భాగస్వామిగా వున్న తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుకి మద్దతు ఇవ్వబోవడం లేదని అందరికీ తెలిసిందే! అయితే, అందువల్ల వచ్చే ఇబ్బంది కరమైన పరిస్ధితుల్ని ఎలా హాండిల్ చేస్తారన్నదే అసలు ప్రశ్న!

ప్రత్యేకహోదా పై చర్చకు తెలుగుదేశం నోటీసు ఇచ్చింది. అదేవిషయమై ప్రయివేటు బిల్లు ఓటింగ్ దశవరకూ వచ్చివున్న నేపధ్యంలో చర్చ అయ్యాకే ఓటింగ్ జరపడమే న్యాయం, ధర్మం, అంతకు మించి పార్లమెంటరీ సాంప్రదాయం! ఇందువల్ల చర్చ జరిగే వరకూ ఓటింగ్ వాయిదా పడుతుంది. చర్చ ప్రస్తుత సమావేశాల చివరికి పోస్టయితే ఓటింగ్ వాయిదా పడినట్టే!

ఇదంతా తెలిసి కూడా కాంగ్రెస్ కాడి వొదిలేయలేదు. ప్రయివేటు బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ తన ఎంపిలందరికీ విప్ జారీ చేసింది. బిల్లుకు అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాల్ని మొదలుపెట్టింది.

ఇదే అంశంపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా, కేవీపీ, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. బిల్లుకు పార్టీలన్నీ మద్దతు పలకాలని రఘువీరా కోరారు. హోదా విషయంలో బీజేపీ మాట తప్పుతోందని.. బిల్లుకు మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బిల్లుకు సంబంధించి పార్టీలన్నీ విప్‌ జారీ చేయాలని రఘువీరా కోరారు. బిల్లుకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కలను నెరవేర్చాలని ఎంపీ కేవీపీ అన్ని పార్టీలను కోరారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా బిల్లుకు సంబంధించి తమ ఎంపీలకు అధికారికంగా సోనియాగాంధీ విప్‌ జారీ చేసినట్లు దిగ్విజయ్‌ తెలిపారు. బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తుందా?..ఇవ్వదా అనేది స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతరాష్ట్రమండలి సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు కూడా అయిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ”ఇతర రాష్ట్రాల స్ధాయిని సమానంగా ఆంధ్రప్రదేశ్ చేరుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని కేంద్రాన్ని అన్నిపార్టీల సమ్మతితోనే విభజన జరిగింది కనుక ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సహకరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

ప్రయివేటు బిల్లుకి తెలుగుదేశం ఓటేస్తే అది కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్య నీతితప్పినట్టే! అలాగని, ఓటింగ్ కి రాకపోతే అవకాశం వచ్చినపుడు కూడా బిజెపి, తెలుగుదేశం పార్టీలు లాలూచీ కుస్తీ / మ్యాచ్ ఫిక్సింగ్ తో ప్రజల్ని మోసం చేస్తున్నాయన్న విమర్శలను మోయవలసి వుంటుంది!

ఏమైనప్పటికీ కెవిపి ప్రయివేటు బిల్లు తెలుకుదేశం పాలిట టిడిపి ముందు గోయ్యి వెనుక నుయ్యి అన్నట్టు మారిపోయింది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫైనల్ లెక్క : పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల 40 వేలు !

పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా...

శ‌ర్వానంద్.. అంత టైమ్ లేద‌మ్మా!!

శ‌ర్వానంద్ కొత్త సినిమా 'మ‌న‌మే' రిలీజ్ డేట్ ఖాయ‌మైంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంటే మ‌రో 15 రోజుల టైమ్ ఉంద‌న్న‌మాట‌. నిజానికి ఓ...

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ఫిదా’ కాంబో మ‌ళ్లీ!

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'ఫిదా'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏ...

అసెంబ్లీకి డుమ్మా…కేసీఆర్ దారిలోనే జగన్ రెడ్డి..?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..? ఇప్పుడిదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close