నల్లగొండ మంత్రుల మధ్య టైం చిచ్చు పెట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంక్చువాలిటీ మిస్ కావడం.. కోమటిరెడ్డి పంక్చువాలిటీ పాటించడంతోనే పెద్ద సమస్య వచ్చింది. అది కోమటిరెడ్డి అలగడానికి కారణం అయింది.
నాగార్జునసాగర్ నిండిపోయింది. నీళ్లు గేట్ల పై నుంచి దూకుతున్నాయి. ఇలాంటి సమయంలో గేట్లు ఎత్తేందుకు సరైన ముహుర్తం ఖరారు చేసుకోలేదు. పై నుంచి వచ్చే ఫ్లోపై స్పష్టత ఉంది కాబట్టి ఎప్పుడు నిండుతుందో తెలుసు కాబట్టి ముందుగానే ..గేట్లు ఎత్తుతారు. కానీ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల.. నిండిపోయాక ముహుర్తం ఖరారు చేశారు. ఉదయమే నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి.. ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో వెళ్లి గేట్లు ఎత్తాల్సి ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు హెలికాఫ్టర్ ను బేగంపేట నుంచి షెడ్యూల్ చేశారు.
కోమటిరెడ్డి తో పాటు ఇంచార్జ్ మంత్రి లక్ష్మణ్ సమయానికే వచ్చారు. కానీ ఉత్తమ్ రెడ్డి మాత్రం తీరిగ్గా పది గంటలకు వచ్చారు. అప్పటికే డ్యామ్ నిండిపోయింది. గేట్ల పై నుంచి నీళ్లు పోతున్నాయి. వెయిట్ చేసి..వెయిట్ చేసి.. అసహనంతో కోమటిరెడ్డి తనకు వేరే పనులు ఉన్నాయని వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఉత్తమ్ వచ్చారు. ఫోన్లకు స్పందించకపోవడం.. అప్పటికే గేట్లు ఎత్తకపోతే.. .నీళ్లు పై నుంచి దూకుతాయని పరువు పోతుందని అధికారుల నుంచి సమాచారం రావడంతో ఉత్తమ్ వెళ్లి గేట్లు ఎత్తారు. అప్పటికి నీరు పై నుంచి పోతూ ఉంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయపాలన పాటించకపోవడం వల్ల.. కోమటిరెడ్డి ఆ విషయంలో పర్ ఫెక్ట్ గా ఉండటం వల్ల సమస్య వచ్చింది. ఉత్తమ్ సమయపాలన గురించి కాంగ్రెస్ లో చాలా సెటైర్లు వినిపిస్తూంటాయి.