ఇళ్ల నిర్వహణలో వచ్చే సమస్యల కారణంగా ముందుగా పాడైపోయే వాటిలో గుమ్మాలు,తలుపులు ఎక్కువగా ఉంటాయి. బాత్ రూమ్స్ ఉండే తలుపులు, గుమ్మాలు పాడైపోయిన ఇళ్లు ఎన్నో ఉంటాయి. వాటిని బాగుచేయించుకోవడం కూడా పెద్ద సమస్య. మెల్లాగ ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.
ఇంటి నిర్మాణంలో పీవీసీ వినియోగం కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది . చెదల సమస్య లేకుండా ఇంటి నిర్మాణంలో పీవీసీ వస్తువుల్ని ఎంపిక చేసుకుంటున్నరాు. పీవీసీ ఒక సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్. చెదలు పీవీసీని తినలేవు. చెదలు తేమ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి. పీవీసీ తేమను గ్రహించదు. అందుకే ఇప్పుడు వంటగదులు, స్నానగదులు వంటి తడి ప్రాంతాల్లో పీవీసీ గుమ్మాలు, తలుపులనే వాడుతున్నారు.
కిటికీలు కూడా ఇటీవలి కాలంలో uPVCవే వాడుతున్నారు. అన్ప్లాస్టిసైజ్డ్ పీవీసీ విండో ఫ్రేములు, డోర్లు చెక్కకు బదులుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో ఆఫీసుల నిర్మాణాలకు వాడేవారు. ఇప్పుడు ఇళ్లకూ అందుబాటులోకి వచ్చాయి. uPVC చెదలకు నిరోధకంగా ఉండటమే కాకుండా, UV నష్టం, పగుళ్లు, వాతావరణ మార్పులను తట్టుకుంటుంది.
ఇక వినైల్ PVC ఆధారిత ఫ్లోరింగ్ , వాల్ ప్యానెల్స్ చెక్క కు ప్రత్యామ్నయాంగా మారాయి. పీవీసీ సైడింగ్ , రూఫింగ్ కూడా ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. చెదల సమస్య లేకుండా ఇంటి నిర్మాణంలో పీవీసీ వినియోగం భారీగా పెరుగుతోంది. ముందు ముందు చెక్కను పీవీసీ రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.