‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొన్నారు సుకుమార్. ఇప్పుడు ఆయన కుమార్తెకు జాతీయ పురస్కారం లభించింది. సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గాంధీతాత చెట్టు’. ఈ చిత్రంలో నటనకు గానూ సుకృతికి ఉత్తమ బాల నటిగా జాతీయ పురస్కారం లభించింది. ఈరోజు ఢిల్లీలో 71వ జాతీయ అవార్డుల్ని ప్రకటించారు. అందులో భాగంగా సుకృతికి అవార్డు దక్కింది.
పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సుకుమార్ సైతం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాకున్నా ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సుకృతికి జాతీయ పురస్కారం లభించడం గొప్ప బూస్టప్. ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా కొట్టించుకొంది. ఆమె కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కినట్టైంది.
ఈ కేటరిగిలో సుకృతితో పాటుగా కబీర్ భండారీ, త్రిష దోషల్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్‌లకు కూడా అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ బాల నటుల కేటగిరిలో ఇంతమందికి అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి.