ఓనమాలు రాని వాడు కూడా ఇంటి పేరులా జర్నలిస్టు అని పెట్టుకుంటున్నాడు అని శుక్రవారమే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జర్నలిస్టులంటే విలువ లేకుండా చేసిన వాళ్లపై ఆయన అసహనంతో మాట్లాడారు. ఎంతో కొంత విలువల్ని పాటించే జర్నలిస్టులంతా రేవంత్ మాటలకు చప్పట్లు కొట్టారు. కానీ కొంత మంది జర్నలిస్టుల్ని ఇలాంటి మాటలు ఎప్పటికీ మార్చలేవు.
జగన్ రెడ్డి కోసం అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ కథనం వడ్డించేసిన వాసుదేవన్ అనే జర్నలిస్టు ఇప్పుడు పరారమయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగారని.. రెక్కీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగితే ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారయ్యారు. అది 99టీవీలో చేశారు కాబట్టి ఆ యాజమాన్యాన్ని పోలీసులు పిలిపిస్తే.. మా దగ్గర ఏ ఆధారాలు లేవని.. ఆ జర్నలిస్టు దగ్గర ఉండవచ్చని ఆయనను తీసుకొచ్చి అప్పగిస్తామని చెప్పారు. కానీ ఆయన పరారవ్వడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తూ నోటీసులు ఇచ్చారు. తమకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఈ పత్రి వాసుదేవన్ ఒకప్పుడు సాక్షిలో ఢిల్లీలో పని చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చి ఎవరికి ఎలా కావాలంటే అలా జర్నలిజం చేస్తున్నారు. ఓ సందర్భంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎస్వీబీసీ చానల్ లో ఏదో పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ స్వప్న ఆ స్థానంలో చేరిపోవడంతో ఆయన అసంతృప్తితో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లి సమాజంలో చిచ్చు పెట్టాలని డిసైడయ్యారు. ఇప్పుడు పరార య్యారు.