ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎదురుచూసేలా ట్రైలర్ రజనీకాంత్ ‘కూలీ’. రజనీ, లోకేశ్ కనగరాజ్ తొలిసారి కలిసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ పై చాలా అంచనాలు వున్నాయి. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ ఇలా చాలా పెద్ద తారాగణం వుంది. ఇంత భారీ సెటప్ లో లోకేష్ ఏం ప్లాన్ చేశాడో తెలుసుకోవాలనే క్యురియాసిటీ అందరిలో కలిగింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
”ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది”అనే నాగార్జున డైలాగ్ తో ట్రైలర్ మొదలైయింది. ఆ తర్వాత శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్, నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇలా వరుసగా పాత్రలని రివిల్ చేసుకుంటూ వెళ్లారు. ”అడుగు పెడితే విజలు మోగులే అనే బీజీఎంతో దేవాగా రజనీకాంత్ ఎంట్రీ.. ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ లన్నీ ఆకట్టుకున్నాయి.
లోకేశ్ కనగరాజ్ కూలీ కోసం చేసిన వరల్డ్ బిల్డింగ్ ఆసక్తికరంగా వుంది. నాగార్జున అండర్ వరల్డ్ డాన్. ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ప్రపంచానికి తెలీయకుండా ఎవరో అక్రమ కార్యక్రమాలు చేస్తుంటాడు. అందులోకి బాషా లాంటి ప్లాష్ బ్యాక్ వున్న దేవా ఎంటరైన తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ట్రైలర్ లో ఈ పాయింట్ కన్వే అయ్యింది.
ట్రైలర్ లో చాలా స్పెషల్ మూమెంట్స్ వున్నాయి. రజినీ, నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర అందరి లుక్స్ స్టయిలీష్ గా వున్నాయి. శ్రుతి హాసన్, సత్యరాజ్ పాత్రలు ఈ కథకు ఎమోషనల్ డ్రైవ్. అనిరుద్ బీజీయం ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. సినిమాలో కొన్ని బిగ్ ఈవెంట్స్ వున్నాయని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. చివర్లో బాషా ఫ్లాష్ బ్యాక్ షాట్ ని వాడటం ఫ్యాన్స్ కి ట్రీట్. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.