అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆ దేశాన్ని పూర్తిగా నేలబారుకు పడేస్తున్నారు. భారత్ పై ఆయన సుంకాలు విధించిన తర్వాత ఆ ఎఫెక్ట్.. భారత్ లోనే కాదు అమెరికాలోనూ కనిపించింది. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఆయన భారత్ ఒక్కరిపైనే కాదు.. అనేక దేశాలపై భారీగా పన్నులేశారు. ఈ పన్నుల మోత వల్ల ఆయా దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి కానీ… ప్రత్యామ్నాయాలు దొరక్కపోతే.. తర్వాత అయినా అధికార పన్నులు కట్టి దిగుమతి చేసుకోవాల్సిందే. అంటే అక్కడి ప్రజలే ఈ భారం భరించాల్సి ఉంటుంది.
భారత్తో సహా ఇతర దేశాలపై 25 శాతం సుంకాలు విధించడం వల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా, అమెరికాలో ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో 2.4 శాతం దీర్ఘకాలంలో 1.2 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఈ ధరల పెరుగుదల సామాన్య అమెరికన్ కుటుంబంపై సంవత్సరానికి సుమారు దాదాపు రూ. 2 లక్షలు అదనపు భారం పడుతుంది.
దిగుమతి సుంకాలు అమెరికా కంపెనీలపై రూ. 7 లక్షల కోట్లు వ్యయ భారం వేయవచ్చని జేపీమోర్గాన్చేజ్ ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది. ఫలితంగా, అమెరికా కంపెనీలు ధరలు పెంచవచ్చు లేదా లాభాలు తగ్గవచ్చు, ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తుంది. సుంకాలు విధించడం వల్ల ఇతర దేశాలు ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా ఎగుమతులు తగ్గవచ్చు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలను బలహీనపరుస్తుంది. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యం 50% వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావితం అవుతుంది.
సుంకాలు అమెరికా జీడీపీని తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని పెంచడం వల్ల డాలర్ విలువ బలహీనపడుతుంది. అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ విలువ 50 శాతం వరకు తగ్గవచ్చని, BRICS దేశాలు స్వంత వాణిజ్య కరెన్సీని అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు చావు కళ వచ్చేస్తుంది. – అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్నందున, దాని చలామణి పూర్తిగా కుప్పకూలే అవకాశం తక్కువ. అయితే, ఇతర దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు మొగ్గు చూపితే అమెరికా ప్రభావం పూర్తిగా అడుగంటిపోతుంది.