తెలంగాణ ప్రభుత్వం రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల నియమించారు.
అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ ఛైర్పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆరోగ్యం, ఫిట్నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. .
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమితులైనందుకు గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియా ్కౌంట్లో తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చడంలో సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.