గ్రేటర్ మొత్తం ఇప్పుడు హాట్ ప్రాపర్టీ ఏదీ అంటే కోకాపేట అంటారు. ఇది వెస్ట్ జోన్ లో ఉంది. మొత్తం రియల్ వ్యాపారంలో సగానికిపైగా ఈ జోన్ దే. కానీ సౌత్ జోన్ లో తుక్కుగూడ కూడా ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా మారుతోంది. తుక్కుగూడ దక్షిణ హైదరాబాద్‌లో విల్లా ప్రాజెక్టుల హబ్‌గా ఇప్పటికే మారింది. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలు చాలా ఖరీదైనవిగా మారాయి. అందుకే ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది తుక్కుగూడ వైపు చూస్తున్నారు.
కోకాపేటకు ఉన్న ప్రత్యేకతలన్నీ తుక్కుగూడకు ఉన్నాయి. తుక్కుగూడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ORRకి సమీపంలో ఉంటుంది. ఇటీవల కాలంలో తుక్కుగూడలో ఐటీ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఏర్పాటులో వేగం పుంజుకుంది. తుక్కుగూడ సమీపంలోని ఐటీ హబ్‌లలో HCL టెక్ ఇప్పటికీ భారీ క్యాంపస్ నిర్వహిస్తోంది. తుక్కుగూడ సమీపంలోని ఇ-సిటీ SEZ కూడా ఏర్పాటవుతోంది. జెన్‌ప్యాక్ట్ AI-ఆధారిత క్యాంపస్ ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే TCS అడిభట్ల సమీపంలోని ఇ-సిటీ SEZలో భారీ క్యాంపస్ నిర్వహిస్తోంది. ఇది తుక్కుగూడకు దగ్గరగా ఉంది.
తుక్కుగూడ సమీపంలోని ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ఏవియేషన్ , ఎయిరోస్పేస్ రంగాలలో పనిచేసే సంస్థలు ఉన్నాయి. తుక్కుగూడ సమీపంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కమర్షియల్ , ఐటీ రంగాలలో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇ రీజనల్ రింగ్ రోడ్ (RRR) తుక్కుగూడను ఒక ప్రధాన లాజిస్టిక్స్ హబ్ గా మార్చే అవకాశం ఉంది.
తుక్కుగూడ ప్రస్తుతం ఐటీ , పారిశ్రామిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి చోట ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసుకోవడం మంచి పెట్టుబడి అవుతుందన్న అభిప్రాయం రియల్ వర్గాల్లో ఉంది.