వివేకా హత్యకు గురయినప్పుడు బీటెక్ రవి, సతీశ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలే హత్య చేయించారని చెప్పి ఓ పత్రం రాసుకొచ్చి దానిపై సంతకం చేయమని తనపై ఒత్తిడి చేశారని వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. వివేకాను హత్య చేసిన వ్యక్తులే ఇలా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వారంతా నిందితులుగా ఉన్నా స్వేచ్చగా బయట తిరుగుతున్నారని.. బాధితులుగా ఉన్న తాము భద్రత పెట్టుకుని పులివెందులకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఎస్పీతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఎనిమిదో తేదీన వైఎస్ వివేకానందరెడ్డి జయంతి. ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబంతో కలిసి కడపకు వచ్చారు. అయితే పులివెందులలో పరిస్థితులు చూసి తన తల్లి భయపడుతోందని సునీత అన్నారు. పులివెందుల ప్రశాంతంగా బతకాలి అంటే ఎట్లా అని ప్రశ్నించారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి.. తప్పు చేసిన వారు జైల్లో ఉంటే ఎందుకు భయపడుతామని ప్రశ్నించారు. అనుమానితులే… కానీ అందరూ బయటే ఉంటారన్నారు. వివేకా హత్య రోజున నారాసుర రక్త చరిత్ర అని, టీడీపీ వారే చేశారని నన్ను నమ్మించారు. ఇప్పుడు అలాగే… సురేష్ అనే నా బంధువుపై దాడి చేసి అలాగే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పోలీసులను బెదిరించి హత్యాస్థలంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసిన వ్యక్తులు, ఇపుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో డీఎస్పీనే బెదిరిస్తున్నారన్నారు.
సునీత చేసిన కామెంట్స్ సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన పేరును కూడా ఇరికించి.. వివేకానంద హత్య కేసులో బకరాను చేద్దామనుకున్నారు. మొదట్లో సాక్షి పేపర్లో సతీష్ రెడ్డి పేరుతో ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నారు. జగన్ కు మద్దతుగా.. టీడీపీ నేతలపై సవాళ్లు చేస్తున్నారు. ఆయనను చూసి పాపం అనుకుంటున్నారు ఆయన అనుచరులు.