రాజకీయ అజెండాతో తప్పుడు వార్తలు వడ్డించి వదిలేస్తే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి. సాక్షికి సిస్టర్స్ గా వ్యవహరిస్తున్న టీవీ9, ఎన్టీవీపై క్రిమినల్ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
పులివెందులలో వైసీపీ నేతలు ప్రచారానికి అంగీకరించిన ఊరికి కాకుండా.. టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న గ్రామానికి వెళ్లి ఘర్షణలకు కారణమయ్యారు. మళ్లీ వారే డీఎస్పీ కార్యాలయానికి ర్యాలీ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఐజీ కోయ ప్రవీణ్ వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో .. పోలీసులు మాట్లాడిన వీడియోలను ట్విస్ట్ చేసి తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం చేశారు. సాక్షి చేస్తే వాళ్ల పనే అదే అనుకోవచ్చు కానీ.. టీవీ9, ఎన్టీవీ కూడా అదే వీడియోలతో పోలీసులపై తప్పుడు ప్రచారానికి బరి తెగించాయి.
పోలీసులు ఈ మూడు చానళ్లకు నోటీసులు జారీ చేశారు. పోలీసులపై కుట్రలు చేస్తున్నారన్నదానికి ఆధారాలు ఉన్నాయని.. ఆ వీడియోలకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి వీడియో పోలీసుల వద్ద ఉందన్నారు. పోలీసులు ఇప్పుడు ఆ మూడు చానళ్ల వీడియోలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటే…. ఇక ముందు తప్పుడు ప్రచారాలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయం అనుకునే పార్టీల కు మద్దతు ఇవ్వడానికి మీడియా ముసుగులో అవినీతి వ్యాపారవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేయాల్సిన సమయం వచ్చింది.