దేవకట్టా దర్శకత్వంలో సోనీలీవ్ లో రిలీజైన ‘మయసభ’ వెబ్ సిరిస్ తెలుగు రాజకీయ చరిత్ర, తెలుగు కుటుంబాల కథని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చింది.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, సామాజిక స్థితిగతులని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన మయ సభ ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరిస్ లో ఒకటిగా నిలిచింది.
కాకర్ల కృష్ణమనాయుడు (కేకేఎన్), ఎంఎస్ రామిరెడ్డి (ఎంఎస్ఆర్) పాత్రల ద్వారా ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రని చిత్రీకరించిన తీరు ప్రేక్షకులని కట్టిపడేసింది.
కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా చైతన్యరావు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆర్సీఆర్గా సాయికుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మయసభలో కనిపించిన ప్రతి పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా వుంటుంది.
టెక్నికల్ గా చూసుకుంటే.. తెలుగులో బెస్ట్ క్యాలిటీ వెబ్ సిరీస్ లో మయసభ టాప్ వన్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కెమెరా, ఆర్ట్ వర్క్ అలనాటి కాలాన్ని కళ్లముందు తీసుకొచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. దేవాకట్టా రాసిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పించాయి.
మయసభ ఒక ఆకర్షణీయమైన రాజకీయ కథ మాత్రమే కాదు.. ఇది తెలుగు కుటుంబాల కథ. తెలుగు జీవితాల కథ. ప్రతి తెలుగు ప్రేక్షకుడు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది.