ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు బండి సంజయ్ బలప్రదర్శన చేశారు. తన తో. పాటు తన కుటుంబం ఫోన్లను ట్యాప్ చేశారన్న కోసమో.. రాజకీయంగా ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశమో కానీ బండి సంజయ్ అనుచరులు అంతా హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయమే ఆయన గుడికి వెళ్లి అక్కడ్నుంచి ర్యాలీగా సిట్ కార్యాలయానికి వెళ్లారు.
బండి సంజయ్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున కేటీఆర్, కేసీఆర్లకు వ్యతిరేకంాగ పోస్టర్లు వేసుకొచ్చారు. ఒంటి మీద పెయింటింగులు కూడా వేసుకొచ్చారు. బండి సంజయ్ హడావుడి చూస్తే.. నామినేషన్ ఏమైనా వేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇప్పటి వరకూ చాలా మంది నేతలు సిట్ ఎదుట హాజరయ్యారు కానీ ఇలా ఎవరూ బలప్రదర్శన చేయలేదు. కానీ బండి సంజయ్ మాత్రం విచారణను చాలా సీరియస్ గా తీసుకున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నందున ఆయనకు ఉన్నసోర్సుల ప్రకారం..తన ఫోన్ ను ట్యాప్ చేసిన ఆధారాలను కొన్ని బయటకు తెచ్చారు. వాటిని కూడా సిట్ అధికారులకు అందించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు విచారణకు వెళ్లే ముందు….ఫోన్ ట్యాపింగ్ ను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పై ఏ మాత్రం సానుకూలత లేకుండా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగాఉండే బండి సంజయ్ .. సిట్ కేసులోకేసీఆర్, కేటీఆర్ లను దోషులుగా నిరూపించకపోతే ఊరుకునేలా లేరు.