ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్ డేట్లు రావని ఫ్యాన్స్ ముందే ఫిక్సయిపోయారు. అయితే.. వాళ్లకు రాజమౌళి ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు.. ఓ ప్రీ లుక్ విడుదల చేశాడు. మహేష్ మెడలో లాకెట్ ని హైలెట్ చేసిన పిక్ ఇది. నవంబరులో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ రానున్నదని రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైందని, ఓ ప్రెస్ మీట్ తోనో, చిన్నపాటి విజువల్స్ తోనో తీయబోతున్న సినిమాకు న్యాయం చేయలేమని, అందుకే సెప్టెంబరు వరకూ ఆగాలని ఫ్యాన్స్ ని కోరారు. ఇది వరకు చూడని ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం ఖాయమన్న భరోసాని ఈ ట్వీట్ తో ఇచ్చారు. అంతే కాదు.. #Globeltrotter అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. అంతే… విశ్వవ్యాప్త ప్రయాణికుడని అర్థం. దీన్ని బట్టి మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుందన్న హింట్ ని ఇచ్చినట్టైంది.
మహేష్ నటిస్తున్న 29వ చిత్రమిది. ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మాధవన్, ఫృథ్వీరాజ్ సుకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.